ETV Bharat / sports

మహిళల ప్రీమియర్​ లీగ్​ పోరుకు సిద్ధం.. ఇక భారత అమ్మాయిల వంతు - డబ్ల్యూపీఎల్ 2023 జట్టు సారథులు

దేశ అమ్మాయిల క్రికెట్లో మరో విప్లవం రాబోతున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా చర్చల్లో ఉన్న మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌) ఎట్టకేలకు మరొక్క రోజులో కార్యరూపం దాల్చనుంది. అంతర్జాతీయ అమ్మాయిల క్రికెట్​లో భారత్ ఆధిపత్యానికి అలానే స్వదేశంలో క్రికెట్​కు​ ఆదరణ మరింత పెంచేందుకు ఈ లీగ్‌ నాంది పలకనుంది. ఆ వివరాలు..

WPL 2023
మహిళల ప్రీమియర్​ లీగ్​
author img

By

Published : Mar 3, 2023, 9:36 AM IST

Updated : Mar 3, 2023, 10:12 AM IST

ఐపీఎల్​.. ప్రపంచంలోనే అత్యుత్తమ, రిచ్​ లీగ్. యంగ్ ప్లేయర్స్ టాలెంట్​ చాటే వేదికగా.. అత్యంత ప్రతిభ, నైపుణ్యం గల క్రికెటర్లను జాతీయ జట్టుకు అందించే వారథిగా.. భారత క్రికెట్ జట్టును మరింత పటిష్ఠంగా మార్చేందుకు ఈ లీగ్​ ఎంతో దోహదపడింది. అయితే ఇప్పుడిక భారత అమ్మాయిల క్రికెట్​లో విప్లవం రాబోతున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్లుగా చర్చల్లో బాగా నాని.. ఎట్టకేలకు మరొక్క రోజులో మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) కార్యరూపం దాల్చనుంది. అంతర్జాతీయ అమ్మాయిల క్రికెట్లోనూ భారత్​ ఆధిపత్యానికి, అలానే స్వదేశంలోనూ క్రికెట్​ ఆదరణ రెట్టింపు చేసేందుకు ఈ లీగ్‌ నాంది పలకనుంది. శనివారం(మార్చి 4) నుంచి ప్రారంభంకానుంది. మార్చి 4 నుంచి 26 వరకు జరిగే ఈ మెగా టోర్నీ తొలి సీజన్​లో ఐదు జట్లు తలపడుతున్నాయి. దిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్స్‌ ఇందులో పాల్గొననున్నాయి.

అలా మొదలు.. 2005లో తొలిసారి వన్డే ప్రపంచకప్‌ తుది పోరుకు చేరిన తర్వాత భారత అమ్మాయిల క్రికెట్​ జట్టు దశ మారింది. 2006లో మహిళల క్రికెట్‌ బాధ్యతలను బీసీసీఐ అందుకుంది. 2017 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడంతో దేశంలో వనితల క్రికెట్‌కు గుర్తింపు దక్కింది. 2020 టీ20 ప్రపంచకప్‌ తుదిపోరు, కామన్వెల్త్‌ క్రీడల్లో సిల్వర్​ మెడల్​, అలాగే ఈ ఏడాది అండర్‌-19 ప్రపంచకప్‌ విజయం.. ఇలా అన్ని అంశాలు మన అమ్మాయిల క్రికెట్‌కు క్రేజ్​ను పెంచాయి. ఇప్పుడీ మెగా లీగ్‌తో మన అమ్మాయిల క్రికెట్‌ మరోస్థాయికి చేరనుంది.

ఆసీస్​ అలానే మరోస్థాయికి.. ప్రస్తుతం ప్రపంచ మహిళల క్రికెట్లో బలమైన జట్టు పేరు అనగానే ఠక్కున వినిపించేది ఆస్ట్రేలియా జట్టే. రీసెంట్​గా రికార్డు స్థాయిలో ఆరోసారి టీ20 ప్రపంచకప్‌ గెలుచుకోని తమ జట్టు బలం ఏంటో మరోసారి నిరూపించింది. ప్రతికూల పరిస్థితుల్లో, తీవ్ర ఒత్తిడిలో విజయాన్ని ఎలా అందుకోవాలో ఆ జట్టుకు బాగా తెలుసు. గత ఏడు టీ20 వరల్డ్​కప్​లో ఫైనల్స్​కు చేరిన ఆ జట్టు.. ఆరుసార్లు విజేతగా నిలవడమే అందుకు నిదర్శనం. అయితే ఆ జట్టు ప్రామాణికలు, నైపుణ్యాలు మెరుగవడంలో మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ది కీలక పాత్ర. 2015-16లో ఈ లీగ్‌ ప్రారంభమైంది. అయితే అంతకంటే ముందే మూడు సార్లు పొట్టి కప్పును ఆసీస్​ అందుకున్నప్పటికీ.. బిగ్​ బాష్​ లీగ్‌ తర్వాత ఆటలో మరింత నైపుణ్యాన్ని సాధించింది. అలానే మరోవైపు హండ్రెడ్‌ లీగ్‌తోనూ ఇంగ్లాండ్​ అమ్మాయిలు తమ ఆట స్థాయిని మెరుగుపరుచుకుంటున్నారు.

ఇప్పుడు భారత అమ్మాయిలు కూడా.. అలానే ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌తోనూ భారత మహిళలు కూడా క్రికెట్​లో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మెగా టోర్నీల్లో నాకౌట్​ దశలో మన అమ్మాయిలు తడబడతారనే విషయం తెలిసిందే. ఆ బలహీనతను ఈ లీగ్‌ ఎక్స్​పీరియన్స్​తో దూరం చేయచ్చు. ప్రపంచ దేశాలకు చెందిన టాప్​ క్రికెటర్లతో కలిసి ఆడడం, డ్రెస్సింగ్‌ రూమ్ షేర్ చేసుకోవడం.. ఫారెన్​ క్రికెటర్ల కెప్టెన్సీలో ఆడడం.. వల్ల ఎన్నో మెలకువలు నేర్చుకునే అవకాశం మన అమ్మాయిలకు ఉంటుంది. తీవ్ర ఒత్తిడి పరిస్థితులను ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై మంచి అవగాహన ఏర్పడుతుంది.

అవకాశాలు బోలెడు.. 16 ఏళ్లకే టీమ్‌ఇండియా అరంగేట్రం చేసి ఆ తర్వాత కనుమరుగైన ఏపీ క్రికెటర్‌ స్నేహ దీప్తి ఇప్పుడు ఈ లీగ్​లో ఆడబోతుంది. ఈ లీగ్​లో సత్తాచాటి మళ్లీ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. ఈమె వయసు ఇప్పుడు 26ఏళ్లు. అలా అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న యువ క్రికెటర్లకు, జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిలకూ ఈ లీగ్‌ చాలా ఉపయోగపడుతుంది.
రీసెంట్​గా మెగాఆక్షన్​లో స్టార్‌ క్రికెటర్లపై రూ.కోట్ల వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఆయా ఫ్రాంచైజీలు ప్లేయర్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అలాగే ఇప్పుడీ సీజన్‌లో అదరగొట్టే అమ్మాయిలకు తర్వాతి వేలంలో మంచి డిమాండ్‌ ఉంటుంది. యషశ్రీ, షబ్నమ్‌, శ్వేత లాంటి టీనేజీ క్రికెటర్లకు ఈ లీగ్​ ఓ మంచి అవకాశం.
గతంలో ఆర్థికంగా చేయూత లేనప్పుడు అమ్మాయిలు అటు ఉద్యోగాలు చేస్తూనే ఆటలో కొనసాగేవారు. కానీ ఇప్పుడు వారికి బీసీసీఐ అండగా ఉంది. పురుషులతో పాటు సమానంగా మ్యాచ్‌ ఫీజు కూడా ఇస్తోంది. ఇక ఈ మహిళల లీగ్‌తో యువ క్రికెటర్లకు ఓ భరోసా అందుతుంది. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చనే ఓ నమ్మకం కలుగుతుంది. లీగ్‌లో బాగా రాణిస్తే నేషనల్​ టీమ్​తో పాటు లైఫ్​లోనూ సెటిల్ అయ్యేందుకు అవకాశాలుంటాయి.
సానియా మీర్జా (ఆర్సీబీ మెంటార్‌), జులన్‌ గోస్వామి (ముంబయి బౌలింగ్‌ కోచ్‌, మెంటార్‌), ఛార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ (ముంబయి ప్రధాన కోచ్‌), లీసా స్థలేకర్‌ (యూపీ మెంటార్‌), మిథాలీ రాజ్‌ (గుజరాత్‌ మెంటార్‌), రచెల్‌ హేన్స్‌ (గుజరాత్‌ ప్రధాన కోచ్‌) లాంటి దిగ్గజాల సాంగత్యమూ లభిస్తుంది. . ఇవన్నీ భారత అమ్మాయిలకు బాగా ఉపయోగపడతాయి.

ఇదీ చూడండి: బీసీసీఐకి మరో చిక్కు.. మూడో టెస్టు పిచ్​పైనా..!

Last Updated : Mar 3, 2023, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.