ETV Bharat / sports

విరాట్​ను ఎక్కువ సార్లు ఔట్​ చేసిన 'విండీస్​' బౌలర్​ ఎవరో తెలుసా? - భారత్​ వర్సెస్​ విండీస్​ 2023 టెస్టు స్క్వాడ్​

Virat Kohli Test Career : వెస్టిండీస్​తో జరిగిన టెస్టుల్లో పరుగుల వీరుడు విరాట్​ కోహ్లీని తమ బౌలింగ్​తో ఇబ్బంది పెట్టిన​ ఆ ముగ్గురు బౌలర్లు ఎవరంటే?

Virat Kohli West Indies Bowlers
కింగ్​ విరాట్​ను ఎక్కువ సార్లు ఔట్​ చేసిన బౌలర్​ ఎవరో తెలుసా?
author img

By

Published : Jul 12, 2023, 8:47 PM IST

Updated : Jul 12, 2023, 10:05 PM IST

Virat Kohli Test Career : విరాట్​ కోహ్లీ.. పేరుకు తగ్గట్టే పరుగులు వేటలో కింగ్​లా దూసుకుపోతాడు. ఇతడు బ్యాట్​తో మైదానంలో అడుగు పెట్టాడంటే ప్రత్యర్థులకు చెమటలే! అన్ని సందర్భాల్లో ఈ ఫార్ములా వర్కౌట్​ కాకపోయినా దాదాపుగా జరిగి తీరుతుంది! అందుకే విరాట్​ బ్యాట్​ పట్టి క్రీజులోకి దిగాడంటే ప్రత్యర్థి జట్టు నుంచి గట్టి బౌలింగ్​ దళం రంగంలోకి దిగాల్సిందే!

ఆదిలోనే ఆటంకం..
Virat Kohli Test Debut : విరాట్ కోహ్లీకి విండీస్​ గడ్డతో ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. 2011లో జమైకాలో జరిగిన టెస్టుతోనే విరాట్​ తన టెస్టు కెరీర్​ను ప్రారంభించాడు. అయితే ఈ సిరీస్​లోని తొలి మ్యాచ్​లో కేవలం 4,15 పరుగులతో సరిపెట్టుకున్నాడు. అయితే ఇప్పటివరకు వెస్టిండీస్​తో మొత్తం 14 టెస్టులు ఆడిన విరాట్​.. 43.26 స‌గ‌టుతో 822 ప‌రుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 5 హాఫ్​ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో విరాట్​ అత్యధిక వ్యక్తిగత స్కోర్​ 200.

అయితే ఇప్పటివరకు తన క్రికెట్​ కెరీర్​లో ఎన్నో అరుదైన రికార్డులను నమోదు చేసిన ఈ రికార్డుల రారాజును కొందరు బౌలర్లు నానా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా వెస్టిండీస్​ బౌలర్ల దళం విరాట్​ను కొన్ని సార్లు పరుగులు తీయకుండా కట్టడి చేసింది. అంతటి మేటి బౌలింగ్​ వేసి విరాట్​ పరుగుల ప్రవాహానికి అడ్డుపడిన ముగ్గురు విండీస్​ బౌలర్లు ఎవరంటే.. జాసన్ హోల్డర్, షేన్ షిల్లింగ్‌ఫోర్డ్​, ఫిడేల్ ఎడ్వర్డ్స్​.

ఫిడేల్ ఎడ్వర్డ్స్​
Fidel Edwards : మిగ‌తా ఆటగాళ్ల బౌలింగ్​తో పోలిస్తే ఫిడేల్ ఎడ్వర్డ్స్ బౌలింగ్​ కాస్త మెరుగ్గా ఉంటుంది. విరాట్​ కోహ్లీని పరుగులు తీయకుండా కట్టడి చేయడంలో ఎడ్వర్డ్స్ సక్సెస్​ అయ్యాడనే చెప్పాలి. ఈ విభాగంలో మొదటి స్థానంలో కూడా ఉన్నాడు. ఎందుకంటే తాను వేసిన బౌలింగ్​లోని 83 బంతుల్లో కేవలం 30 పరుగులు మాత్రమే కోహ్లీకి ఇచ్చిన ఎడ్వర్డ్స్.. విరాట్​ అరంగ్రేట సిరీస్‌లో మెరుగ్గా రాణించ‌లేక‌పోవ‌డంలో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. మూడు సార్లు ఫిడేల్ ఎడ్వర్డ్స్​ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు విరాట్​ కోహ్లీ.

జాసన్ హోల్డర్​
Jason Holder : విండీస్​తో తలపడిన టెస్టుల్లో కోహ్లీని రెండు సార్లు ఔట్​ చేసిన బౌల‌ర్లు ఐదుగురు ఉన్నారు. అయితే వీరందరితో పోలిస్తే జాసన్​ హోల్డర్​ సగటు కాస్త ఉత్తమంగా ఉంది. ఎత్తులో కాస్త పొడువుగా ఉండడం ఇతడికి జట్టుకి కలిసొచ్చే అంశం. ఆ ఎత్తును ఉప‌యోగించుకుని అద‌న‌పు బౌన్స్‌ను రాబ‌డ‌తాడు హోల్డ‌ర్. అంతేకాకుండా బంతిని స్వింగ్ చేయ‌డంలో ఇతడు దిట్ట. టెస్టుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు కోహ్లీకి 144 బాల్స్​ను సంధించిన హోల్డ‌ర్ 69 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్​లో వీరిద్దరు మళ్లీ తలపడితే ఆట రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

షేన్ షిల్లింగ్‌ఫోర్డ్​
Shane Shillingford : క్రికెట్​ గాడ్​ సచిన్​ తెందుల్కర్​కు అది ఆఖరి టెస్టు సిరీస్​. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జ‌ట్టు మన దేశానికి వ‌చ్చింది. ఆ సిరీస్‌లో ఆఫ్ స్పిన్న‌ర్​ షేన్ షిల్లింగ్‌ఫోర్డ్ కోహ్లీని తన బౌలింగ్​తో ఇబ్బంది పెట్టాడు. అత‌డి బౌలింగ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న విరాట్‌ 30 ప‌రుగులు మాత్రమే చేసి పెవిలియన్​ చేరాడు. కాగా, రెండు సార్లూ అత‌డి బౌలింగ్‌లోనే విరాట్​ ఔట్ అవ్వడం విశేషం. ఇక ప్ర‌స్తుతం టీమ్ఇండియా వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో ఉంది. రెండు టెస్టుల సిరీస్​లో భాగంగా బుధవారం తొలి టెస్టు ప్రారంభమైంది.

Last Updated : Jul 12, 2023, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.