టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కొత్త ఫోన్‌ను పోగొట్టుకొన్నాడట. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టాడు. "బాక్స్‌లో నుంచి బయటకు కూడా తీయని ఫోన్ పోతే.. దానికంటే బాధాకరమైన ఫీలింగ్ మరొకటి ఉండదేమో.. మీలో ఎవరైనా చూశారా..?" అని విరాట్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది చూసిన నెటిజన్లు ఇదేదో యాడ్ అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో ఓ ఫోన్ల సంస్థను ట్యాగ్ చేస్తూ వెంటనే కోహ్లీకి ఓ మొబైల్ పంపించండి.. టెస్టు సిరీస్‌కు ముందు అతడిని ఒత్తిడికి గురి చేయొద్దు అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మాత్రం విచిత్రంగా స్పందించింది. "వదిన గారి ఫోన్ నుంచి ఐస్ క్రీమ్‌ను ఆర్డర్ చేసేందుకు మొహమాటం పడొద్దు. ఇప్పుడు అదే మీకు సాయపడుతుంది" అని జొమాటో కామెంట్ పెట్టింది.
కాగా, ప్రస్తుతం కోహ్లీ ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. రీసెంట్గా భార్యతో కలిసి ఆధ్యాత్మిక టూర్‌కు వెళ్లిన విరాట్.. ఇప్పుడు నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. ఆసీస్‌పై మంచి రికార్డు ఉన్న కోహ్లీ.. తనదైన ఆటతీరుతో మరోసారి ఆధిక్యం సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాగ్‌పుర్ వేదికగా భారత్ - ఆసీస్ తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి: అశ్విన్‌ను చూస్తే ఆస్ట్రేలియాకు కంగారు ఎందుకో?