ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఘోరంగా బ్యాటింగ్ చేసింది. 78 పరుగులకు ఆలౌట్ కాగా, బ్యాట్స్‌మెన్‌లో కనీసం ఒక్కరైనా 20 పరుగులు చేయకుండా ఔట్ అయిపోయారు. ఇలా జరగడం టెస్టుల్లో భారత్‌కు ఇదే తొలిసారి. మరోవైపు కెప్టెన్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ మ్యాచ్‌లోనూ నిరాశే ఎదురైంది.
చివరగా 2019 నవంబరులో బంగ్లాదేశ్‌పై డే అండ్ నైట్ టెస్టులో శతకం నమోదు చేసిన విరాట్.. ఆ తర్వాత ఏ ఫార్మాట్లోనూ ముడంకెల స్కోరు అందుకోలేకపోయాడు. అలా ఇప్పటికీ 50 ఇన్నింగ్స్‌లు దాటిపోగా.. 642 రోజులు గడిచిపోయాయి. ఇంకా ఎప్పుడు ఆ మార్క్‌ను అందుకుంటాడో అని క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కోహ్లీ ఒకేరకంగా ఔట్ అవుతూ వస్తున్నాడు. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని వేటాడి.. కీపర్ లేదంటే స్లిప్ ఫీల్డర్‌కు చిక్కుకుంటున్నారు. మూడో టెస్టులోనూ ఇలానే జరిగింది. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అండర్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
"కోహ్లీ ఫెంటాస్టిక్ ప్లేయర్. మీరు జట్టుగా నిశ్శబ్దంగా ఉండాలనుకునే వ్యక్తి. అయితే టెస్టుల్లో చెలరేగడం మొదలుపెడితే అతడిని ఆపడం ఎవ్వరి తరం కాదు" అని అండర్సన్, తొలిరోజు ఆట అనంతరం చెప్పాడు.
ఇవీ చదవండి: