ETV Bharat / sports

Viral Video: 'ఏంటిది అంపైర్​?.. ఇలా కూడా ఔట్ ఇస్తారా?' - అంపైర్ తప్పుడు నిర్ణయం

Umpire Wrong Decision: అంపైరింగ్​లో కొన్నిసార్లు తప్పులు దొర్లడం సహజం! బాల్ గురించిన స్పష్టత కరవైన సమయంలోనూ నిర్ణయాల్లో పొరపాట్లు జరుగుతాయి. అయితే కౌంటీల్లో ఇటీవలే జరిగిన ఓ మ్యాచ్​లో అంపైర్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్​కు గురిచేస్తోంది. ఇంతకీ ఏమైందంటే..

umpire wrong decision in today's match
Viral Video
author img

By

Published : Apr 26, 2022, 2:24 PM IST

Umpire Wrong Decision: క్రికెట్‌లో అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మనం చాలాసార్లు చూసే ఉంటాం. దీంతో ఆటగాళ్లు ఔట్‌కాకున్నా చేసేదేం లేక నిరాశగా వెనుదిరుగుతారు. అది ప్రధానంగా ఎల్బీడబ్ల్యూల విషయంలో లేదా కీపర్‌ పట్టే క్యాచ్‌ల్లో స్పష్టత కొరవడి అటువంటి సంఘటనలు చోటుచేసుకొంటాయి. అయితే, ఇక్కడ మనం చెప్పుకునే విషయంలో.. ఓ అంపైర్‌ అనూహ్య రీతిలో ఔటివ్వడమే చర్చనీయాంశంగా మారింది. అది చూడ్డానికి హాస్యాస్పదంగానూ మారింది. దీంతో ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

కెంట్‌, హాంప్‌షైర్‌ జట్లు ఈనెల 21 నుంచి 24 వరకు కౌంటీ క్రికెట్‌లో తలపడ్డాయి. ఈ సందర్భంగా ఆదివారం కెంట్‌ ఆటగాడు జోర్డాన్‌ కాక్స్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా బౌలర్‌ వేసిన ఓ బంతి వికెట్లకు దూరంగా ఆఫ్‌సైడ్‌ వెళుతుండగా.. కాలి ప్యాడ్‌తో అడ్డుకున్నాడు. అప్పటికే తన బ్యాట్‌ను వెనకవైపు ఉంచాడు. అయితే, ఆ బంతి జోర్డాన్‌ ప్యాడ్లకు తాకి గాల్లోకి లేచింది. వెంటనే అక్కడ షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న వ్యక్తి దాన్ని ఒడిసిపట్టడం వల్ల మిగిలిన ఆటగాళ్లంతా అప్పీల్‌ చేశారు. దీంతో జోర్డాన్‌ను అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మీరే అంపైర్‌ అయితే దీన్ని ఔటిస్తారా అని వ్యంగ్యంగా నిలదీస్తున్నారు. మీరూ ఆ వీడియో చూసి సరదాగా నవ్వుకోండి.

ఇదీ చూడండి: టీమ్​ఇండియా ప్చ్​.. ఇలాగైతే ఈసారీ టీ20 ప్రపంచకప్​ కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.