ETV Bharat / sports

ఆ హాస్పిటల్​ చుట్టూ ఊర్వశి చక్కర్లు! పంత్​ కోసమే!! - ఊర్వశి రౌతేలా పోస్ట్స్​

బాలీవుడ్​ నటి ఊర్వశి రౌతేలా ఏదో ఒక విషయంతో నెట్టింట్లో వైరలవుతూనే ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ఆమె పెట్టే ప్రతి పోస్ట్ అనేక చర్చలకు దారి తీస్తుంటుంది. ఆమె పరోక్షంగా పంత్​ను ఉద్దేశించే ఆ పోస్టులు పెడుతోందన్న అభిమానులు.. మరోసారి ఈ మాట నిజం అంటున్నారు. ఇందుకు కారణం ఏంటంటే.​.

urvashi rautela shares hospital pic
rishab pant urvashi rautela
author img

By

Published : Jan 6, 2023, 1:12 PM IST

Updated : Jan 6, 2023, 2:21 PM IST

ఛాన్స్​ దొరికిన ప్రతిసారీ ఏదో ఒక రూపంలో నెట్టింట్లో హాట్​ టాపిక్​గా మారడం ఊర్వశి రౌతేలాకు అలవాటు. ఆమె గత కొంత కాలంగా క్రికెటర్​ రిషభ్​​ పంత్​ ప్రస్తావన తెచ్చేలా పరోక్షంగా తన సోషల్​ మీడియా హ్యాండిల్స్​లో ఎన్నో పోస్టులు చేసింది. దీంతో ఆమె అతడ్ని ఇష్టపడుతోందని అభిమానులు అంటున్నారు. అయితే ఈ మాటలను ఇరువురు బలంగా కొట్టిపారేస్తున్నారు. కానీ ఆమె తాజాగా పెట్టిన పోస్ట్​తో మరోసారి నెటిజన్లు ఇందులో కచ్చితంగా ఏదో రహస్యం ఉందని అంటున్నారు. ఇంతకీ ఆ పోస్ట్​ ఏంటంటే.

రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా ప్లేయర్​ రిషభ్​ పంత్​ దెహ్రాదూన్​లో ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత తదుపరి ట్రీట్మెంట్​ కోసం ముంబుయిలోని కోకిలాబెన్​ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రికి చేరుకున్నాడు. అక్కడుండే ఇక తను చికిత్స తీసుకుంటాడని బీసీసీఐ సైతం తెలిపింది. ఈ క్రమంలో తాజాగా రిషభ్​​ గురించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

పంత్‌ ప్రమాదానికి గురైన కొన్ని గంటల తర్వాత 'ప్రార్థిస్తున్నా' అని ఊర్వశి రౌతేలా పోస్ట్‌ చేసింది. అదే సమయంలో ఆ రోజు ఫుట్​బాల్​ దిగ్గజం పీలేతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి కన్నుమూశారు. దీంతో ఈ పోస్ట్​ ఆమె చేసుండచ్చు అని కొందరకు అంటుండగా.. లేదు ఆమె పంత్​ కోసమే ఈ పోస్ట్ పెట్టారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

urvashi rautela shares hospital pic
ఊర్వశీ రౌతేలా ఇన్​స్టా స్టోరీ

అయితే గురువారం ముంబయిలో ఉన్న రౌతేలా మరోసారి గాసిప్స్​ను నిజం చేసేలా ఓ పోస్ట్​ పెట్టింది. అదేందంటే.. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రి ఫొటోను షేర్‌ చేసింది. అది కూడా పంత్‌ను ముంబయికి షిప్ట్‌ చేసిన కొన్ని గంటల సమయంలోనే ఆమె ఈ పోస్ట్‌ చేయడం గమనార్హం.

పంత్‌-ఊర్వశి రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ గతంలో రూమర్స్​ వచ్చాయి. 2018 నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇద్దరూ కలిసి రెస్టారెంట్లు, షాపింగ్‌, పార్టీలు అంటూ తిరిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు.. వీరు డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలకు బలం చేకూర్చాయి. అయితే, 2019లో ఈ వార్తలను స్వయంగా పంత్‌ ఖండించాడు. తనకు ఆల్రెడీ ఓ గర్ల్‌ఫ్రెండ్‌ ఉందని, ఆమెతోనే తాను రిలేషన్​లో ఉన్నట్లు స్పష్టం చేశాడు. అయినప్పటికీ పంత్‌-ఊర్వశిపై పుకార్ల వెల్లువ ఆగట్లేదు.

Last Updated : Jan 6, 2023, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.