ETV Bharat / sports

Trump Dhoni : ధోనీకి ట్రంప్ స్పెషల్​ ఇన్విటేషన్​.. గోల్ఫ్​ ఆడేందుకు పిలిచి.. - డొనాల్డ్​ ట్రంఫ్​తో గోల్ఫ్​ ఆడిన ఎంఎస్​ ధోనీ

Trump Dhoni : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజాగా గోల్ఫ్​ ఆడుతూ కనిపించారు. తాజాగా అమెరికాలో టెన్నిస్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లిన ఆయన.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో గోల్ఫ్ ఆడారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

Trump Dhoni
Trump Dhoni
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 11:00 AM IST

Updated : Sep 8, 2023, 12:43 PM IST

Trump Dhoni : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజాగా గోల్ఫ్​ ఆడుతూ కనిపించారు. తాజాగా అమెరికాలో టెన్నిస్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లిన ఆయన్ను.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ గోల్ఫ్ ఆడేందుకు ఆహ్వానించారు. ఇక ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా గోల్ఫ్ ఆడారు. ఆ తర్వాత ధోనీతో ట్రంప్​ ఆప్యాయంగా మాట్లాడి క్రికెట్ సంగతులు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్​కు కూడా మహీ అంటే ఇష్టమేనట. అందుకే ధోనీ అమెరికాలోనే ఉన్నాడని తెలుసుకుని అతడిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ధోనీ కోసం ట్రంప్‌ ప్రత్యేకంగా ఈ గోల్ఫ్‌ గేమ్‌ ఏర్పాటు చేసినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. దుబాయి వ్యాపారవేత్త, ధోనీ స్నేహితుడు హితేశ్‌ సంఘ్వీ తొలుత ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్​లో షేర్‌ చేశారు. ఆ తర్వాత ట్రంప్‌తో ధోనీ గోల్ఫ్‌ ఆడుతున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్​ అవుతోంది.

Ms Dhoni US Open : తాజాగా ధోనీ యూఎస్ ఓపెన్‌లోనూ సందడి చేశాడు. గురువారం కార్లోస్‌ అల్కరాస్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్స్​ మ్యాచ్​ను.. స్టేడియంలో స్నేహితులతో కలిసి వీక్షించాడు. ఓ సాధారణ ప్రేక్షకుడిగా మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ కనిపించాడు. ఆట మధ్యలో స్పెయిన్ ఆటగాడు అల్కరాస్ రెస్ట్ తీసుకొని డ్రింక్స్ తాగుతున్న సమయంలో అతడిపై కెమెరా ఫోకస్​ చేయగా.. వెనుకవైపు ఫ్రెండ్స్​తో కూర్చొని ముచ్చటిస్తున్న ధోనీ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్​గా మారింది.

MS Dhoni Leg Surgery : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. ప్రస్తుతం కెరీర్​లో ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న అందరికీ సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా కొనసాగుతున్న ఆయన.. ఐపీఎల్-2023లో ఆ జట్టును విజేతగా నిలిపాడు. మ్యాచ్​ సమయంలోనే మోకలి గాయంతో బాధపడ్డ ధోనీ.. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్నాడు. ప్రస్తుతం తన కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడుపుతూ లైఫ్​ను ఎంజాయ్ చేస్తున్నాడు.

Asia Cup Best Partnership : ధోనీ -రైనా.. ధావన్​- రోహిత్​.. ఆసియా కప్​లో బెస్ట్ పార్టర్న్​షిప్స్​ ఇవే!

Asia Cup Most Runs By Indian Batters : ఆసియా కప్​లో భారత బ్యాటర్ల హవా.. సింగిల్ ఎడిషన్​లో టాప్ 5 ఎవరంటే?

Last Updated : Sep 8, 2023, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.