భవిష్యత్‌లో టీమిండియాకు మేటి ఆటగాళ్లను (fast bowling coach updates) అందించడానికి నేషనల్ క్రికెట్ అకాడమీకి కొత్త కోచ్‌లను నియమించనుంది బీసీసీఐ. ఫాస్ట్ బౌలర్లను తయారు చేయాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా కోచ్ ట్రోయ్ కూలిని ఎంపిక చేసింది. ప్రపంచ క్రికెట్లో కూలి అత్యత్తమ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ప్రఖ్యాతి పొందాడు.
ఇషాంత్ శర్మ, షమీ, ఉమేష్ యాదవ్‌తో సహా అందరూ దాదాపు 30వ వడిలో ఉన్నారు. మరో రెండు, మూడేళ్లు మాత్రమే క్రియాశీలంగా ఆడగలరు. మరో తరం క్రీడాకారులను తయారు చేయడం కోసం బీసీసీఐ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ప్రధానంగా పేసర్లపైనే దృష్టి సారించింది. ప్రధాన టీంలో లేని పది మంది జూనియర్ బౌలర్లను ఎంచుకుని (pacers contract 2021) వారిని రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది.
హృషికేశ్ కనిట్కర్, శివ సుందర్ దాస్‌లను బ్యాటింగ్ కోచ్‌లుగా బీసీసీఐ నియమించింది. సితాంన్షు కోటక్ మూడో బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు. ముంబయి లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించనున్నారు. ఫీల్డింగ్‌కు ఇప్పటికే ముగ్గురు కోచ్‌లు సుభాదీప్ ఘోష్, టీ దిలీప్, మునీష్ బలీలను బీసీసీఐ నియమించింది. దిలీప్ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న టీమ్ఇండియా సీనియర్ టీం కోసం పనిచేస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఇండియా ఏ టీం కోసం సుభాదీప్ సేవలు అందిస్తున్నారు.
ఇదీ చదవండి:Champions Trophy: పాకిస్థాన్‌కు టీమ్ఇండియా.. నిర్ణయం అప్పుడే