TNPL 2023 sai sudarshan : ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023(ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయిసుదర్శన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో మంచి ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా చెన్నైతో జరిగిన ఫైనల్లో అయితే 96 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ అతడు సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్-2023(Tamilnadu premier league) సీజన్లో తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో కోవై కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
lyca kovai kings vs idream tiruppur : కొవై కింగ్స్ ఈ సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. శ్రీరామకృష్ణ కళాశాల స్టేడియం వేదికగా ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. 70 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇందులో భాగంగా.. మొదట బ్యాటింగ్ చేసిన కోవై కింగ్స్.. 14 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో కష్టాల్లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సాయిసుదర్శన్.. మరో బ్యాటర్ ముకిలేష్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను సరిదిద్దాడు.
సాయిసుదర్శన్ సంచలన ఇన్నింగ్స్.. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ముకిలేష్ ఔటైనప్పటికీ సాయిసుదర్శన్ మాత్రం చెలరేగాడు. స్కోర్ బోర్డును ముందుకు పరుగులు పెట్టించాడు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 45 బంతులు ఎదుర్కొన్న అతడు.. ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్స్‌ల సాయంతో 86 పరుగులు చేశాడు. అలా సుదర్శన్ విధ్వంసకర ఇన్నింగ్స్ వల్ల.. కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 179 పరుగులు చేసింది.
అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది తిరుప్పూర్ తమిజన్స్. అయితే కోవై కింగ్స్ బౌలర్లలో కెప్టెన్ షారుఖ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ రెండు, ముకిలేష్, జాతవేద్ సుబ్రమణ్యన్ తలో వికెట్ పడగొడ్డడంతో తమిజన్స్ 109 పరుగులకే కుప్పకూలింది. తమిజన్స్లో తుషార్ రహీజా(33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విశాల్ వైద్య(16), భువనేశ్వరన్(12), అజిత్ రామ్(11) పరుగులు చేశారు. మిగాత వారు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.
ఇదీ చూడండి :
IPL 2023 Final: సాయి సుదర్శన్ సర్ప్రైజ్ హిట్టింగ్.. హైలైట్ ఇదే!