ETV Bharat / sports

IND VS SA: సఫారీతో ఢీ.. జోరు మీదున్న టీమ్​ఇండియా.. కానీ అదొక్కటే

author img

By

Published : Sep 27, 2022, 6:39 PM IST

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య తొలిపోరు రేపు తిరువనంతపురం వేదికగా జరగనుంది. టీ20 సిరీస్‌లో ఆసీస్‌పై నెగ్గిన టీమ్​ఇండియా.. దక్షిణాఫ్రికాపై కూడా అదే జోరు ప్రదర్శించాలని కోరుకుంటోంది. బుధవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాబలాలుపై ఓ లుక్కేద్దాం..

teamindia southafrica
టీమ్​ఇండియా దక్షిణాఫ్రికా

వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కన్నా ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 2-1తో నెగ్గిన టీమ్​ఇండియా.. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌ను కూడా సొంతం చేసుకుని మెగా టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా చివరి ఓవర్లలో టీమ్​ఇండియా బౌలింగ్‌ ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యను టీ20 ప్రపంచకప్‌ కంటే ముందే పరిష్కరించుకోవాలని భావిస్తోంది.

ఆల్‌రౌండర్‌ హర్దిక్‌ పాండ్యా, పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు దక్షిణాఫ్రికాతో సిరీస్‌ కోసం విశ్రాంతినిచ్చారు. కొవిడ్‌ నుంచి ఇంకా కోలుకోని కారణంగా మహమ్మద్‌ షమీ కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. ప్రత్యర్థి బ్యాటర్లకు భారీగా పరుగులిస్తున్న పేసర్‌ హర్షల్‌ పటేల్‌ ఈ సిరీస్‌లో గాడిలో పడాల్సిన అవసరం ఉంది. ఇక ప్రపంచకప్‌ కోసం స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికైన దీపక్ చాహర్‌కు ఈ సిరీస్‌లో ఆడే అవకాశం దక్కనుంది. మరో పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా తిరిగి జట్టులో చేరాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అదరగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచిన అక్షర్‌ పటేల్‌... దక్షిణాఫ్రికాపై కూడా అదే ఫామ్‌ కొనసాగించాలని కోరుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్‌ కంటే ముందు అందరి ఆటగాళ్లకు ఆడే అవకాశం ఇవ్వాలని భావిస్తున్న కెప్టెన్ రోహిత్‌ శర్మ.. అశ్విన్‌కు కూడా తుది జట్టులో చోటు ఇచ్చే అవకాశం ఉంది.

బ్యాటింగ్‌ విభాగంలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, సూర్య కుమార్‌ యాదవ్‌ ఫామ్‌లో ఉండగా.. కేఎల్​ రాహుల్‌ ఇంకా గాడిలో పడాల్సిన అవసరం ఉంది. ఇక దినేష్‌ కార్తీక్‌కు పెద్దగా క్రీజ్‌లో ఉండే అవకాశం దక్కలేదు. మరోవైపు వెన్నునొప్పి కారణంగా దీపక్‌ హుడా జట్టుకు దూరం కావడం వల్ల అతని స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ జట్టులోకి రానున్నాడు.

సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భారత్‌ ఒక్కదాంట్లో కూడా నెగ్గకపోవడం గమనార్హం. టీ20 ప్రపంచకప్‌లో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్‌, దక్షిణాఫ్రికా అక్కడ కూడా తలపడన్నాయి. అయితే ఆస్ట్రేలియాలో పిచ్‌ కండిషన్స్‌ వేరుగా ఉండటం సహా మైదానాలు కూడా పెద్దవిగా ఉంటాయి. బవుమా నేతృత్వంలో దక్షిణాఫ్రికా జట్టు... ఈ సిరీస్‌లో బరిలోకి దిగనుంది. మ్యాచ్‌ బుధవారం రాత్రి 7 గంటలకు ఆరంభంకానుంది.

ఇదీ చూడండి: జీరో గ్రావిటీలో ఫుట్​బాల్ మ్యాచ్​.. అదిరిపోయే గోల్ కొట్టిన స్టార్ ప్లేయర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.