ETV Bharat / sports

ఓటమి బాధలో ఉన్న టీమ్​ఇండియాకు రెండు షాక్​లు​- టాప్​ ప్లేస్​ ఔట్​, ఐసీసీ ఫైన్​! - టీమ్​ఇండియా wtc

Team India WTC Points Table : భారత క్రికెట్​ జట్టుకు మరో షాక్​. సఫారీలతో జరిగిన తొలి టెస్ట్​లో భారీ తేడాతో ఓడిపోవడం వల్ల వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కోల్పోయింది టీమ్​ఇండియా. ప్రస్తుతం ఎన్నో స్థానంలో ఉందంటే?

Team India WTC Points Table
Team India WTC Points Table
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 12:09 PM IST

Updated : Dec 29, 2023, 12:55 PM IST

Team India WTC Points Table : దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్​లో ఘోర పరాభవాన్ని చవిచూసిన టీమ్​ఇండియాకు మరో షాక్​ తగిలింది. ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఓడిపోవడం వల్ల వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఐదో స్థానానికి దిగజారిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు 66.67 పాయింట్ల శాతంతో టీమ్​ఇండియా ఫస్ట్ ప్లేస్​లో ఉండేది. కానీ ఓటమితో ఇప్పుడు భారత్‌ పాయింట్ల శాతం ఏకంగా 44.44కు పడిపోయింది.

టాప్​లో దక్షిణాఫ్రికా
కాగా, ఈ మ్యాచ్​లో అద్భుత విజయం సాధించిన దక్షిణాఫ్రికా 100 పాయింట్ల శాతంతో టాప్‌కు చేరుకుంది. సౌతాఫ్రికా తర్వాతి స్థానాల్లో వరుసగా పాకిస్థాన్​ (61.11), న్యూజిలాండ్‌(50.0) జట్లు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా 41.67 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో ఉంది.

Team India WTC Points Table
రల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్ 2023-25 పాయింట్ల పట్టిక

రెండో టెస్టులో భారత్‌ విజయం సాధిస్తే!
అయితే పాకిస్థాన్​తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరే ఛాన్స్‌ ఉంది. అదే విధంగా కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టులో భారత్‌ విజయం సాధిస్తే తమ స్థానాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది.

టీమ్​ఇండియాకు ఫైన్​
సౌతాఫ్రికా పర్యటనలో తొలి టెస్టు ఓడి నిరాశలో ఉన్న టీమ్ఇండియాకు షాక్ తగిలింది. నిర్దేశించిన సమయం కంటే ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా 2 ఓవర్లు వెనకబడింది. దీంతో ఐసీసీ రూల్స్ ఆర్టికల్​ 2.22 ప్రకారం భారత్ ప్లేయర్లకు 10 శాతం మ్యాచ్ ఫీజులో కోత పడింది. అంతేకాకుండా డబ్ల్యూటీసీ 2023-25 టేబుల్​లో టీమ్ఇండియాకు రెండు మైనస్ పాయింట్లు విధించారు. ఓవర్​కు ఒక పాయింట్ చొప్పున, రెండు మైనస్ పాయింట్లు టీమ్ఇండియా ఖాతాలో చేరినట్లు ఐసీసీ వెల్లడించింది.

రోహిత్​ చెత్త రికార్డు
మరోవైపు, ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ దారుణ ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసి రబాడ బౌలింగ్‌లో రోహిత్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో టెస్టు క్రికెట్‌లో డకౌటైన రెండో భారత కెప్టెన్‌గా రోహిత్‌ నిలిచాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ ఉన్నాడు. 2011 ప్రోటీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధోనీ డకౌట్‌గా వెనుదిరిగాడు. తాజా మ్యాచ్‌తో రోహిత్‌ కూడా ఈ జాబితాలోకి చేరాడు. కాగా టెస్టుల్లో హిట్‌ మ్యాన్‌ను రబాడ ఔట్‌ చేయడం 14వ సారి కావడం గమనార్హం.

Last Updated : Dec 29, 2023, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.