ETV Bharat / sports

శిఖరాగ్రాన భారత జట్టు.. ఆ మ్యాచ్​తో 1000 వన్డేల రికార్డు

Team India ODI Record: వెస్టిండీస్​తో వన్డే సిరీస్​ నేపథ్యంలో టీమ్​ఇండియా అరుదైన ఘనత సాధించనుంది. వన్డేల్లో 1000 మ్యాచ్​లు ఆడిన తొలి టీమ్​గా నిలువనుంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్​ కంటే ముందుగానే భారత్​ ఈ ఘనత సాధిస్తుండటం విశేషం.

team india
టీమ్​ఇండియా
author img

By

Published : Jan 30, 2022, 4:26 PM IST

Team India ODI Record: టీమ్ఇండియా, వెస్టిండీస్​ మధ్య వన్డే సిరీస్​కు సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 6 నుంచి భారత్​ వేదికగా సిరీస్​ ప్రారంభంకానుంది. అయితే.. ఈ మ్యాచ్​ టీమ్​ఇండియాకు ఎంతో ప్రత్యేకం కానుంది. క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 1000 వన్డేలు ఆడిన తొలి జట్టుగా టీమ్​ఇండియా నిలువనుంది.

భారత్​ 1000వ వన్డే మ్యాచ్​కు అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక అవుతుండటం విశేషం. అయితే.. టీమ్​ఇండియా తొలి వన్డే మ్యాచ్​ లీడ్స్​ వేదికగా 1974 జులై 13న ఆడింది. ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఆస్ట్రేలియా టాప్..

australia
అత్యధిక వన్డే విజయాలు సాధించిన ఆస్ట్రేలియా జట్టు

ఇప్పటివరకు 999 మ్యాచ్​లాడిన భారత్ 518 విజయాలు సొంతం చేసుకుంది. 431 మ్యాచ్​ల్లో ఓడిపోయింది. 581 విజయాలతో ఆస్ట్రేలియా జట్టు టాప్​లో ఉంది. కాగా, 432 ఓటములతో శ్రీలంక జట్టు.. ఎక్కువసార్లు ఓడిపోయిన జాబితాలో రెండో స్థానంలో ఉంది.

రెండు జట్లే..

టీమ్ఇండియాతో పాటు రెండు జట్లు మాత్రమే ఇప్పటివరకు 900లకు పైగా వన్డేలు ఆడాయి. ఆస్ట్రేలియా 958 మ్యాచ్​లు ఆడగా, పాకిస్థాన్​ 936 గేమ్స్ ఆడింది. ఆసీస్​ మొత్తంగా 581 విజయాలు సాధించి.. 334 సార్లు ఓటమి చవిచూసింది. పాక్​ జట్టు 490 విజయాలు సాధించి.. 417 సార్లు ఓడిపోయింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

IPL 2022: స్వదేశంలోనే ఐపీఎల్.. ఆ రెండు రాష్ట్రాల్లో మ్యాచ్​లు!

'కెప్టెన్​గా కోహ్లీ సక్సెస్.. అతడు మాత్రం ఫెయిల్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.