ETV Bharat / sports

టీమ్ఇండియా క్రికెటర్ల వార్షిక జీతాలు ఎంతో తెలుసా? - విరాట్ కోహ్లీ జీతం

Team India Salaries: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరుగాంచింది బీసీసీఐ. మరి భారత క్రికెటర్ల జీతాలు తక్కువగా ఉంటాయా? జాతీయ జట్టులోని పురుష క్రికెటర్లు అయితే ఏడాదికి కోట్లలో ఆర్జిస్తున్నారు. మహిళలకు మాత్రం జీతాలు తక్కువనే చెప్పాలి. దేశవాళీ క్రికెటర్లకు కూడా ఇటీవలే 50 శాతం మ్యాచ్ ఫీజు పెంచింది బోర్డు. ఈ నేపథ్యంలో మన భారత ఆటగాళ్ల జీతాలు ఎలా ఉన్నాయో చూద్దామా!

Team India salaries, టీమ్ఇండియా ఆటగాళ్ల జీతాలు
Team India
author img

By

Published : Jan 5, 2022, 4:53 PM IST

Team India Salaries: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి పేరుంది. టీమ్ఇండియా ఆడే మ్యాచ్​లకు భారీ డిమాండ్ ఉంటడమే ఇందుకు కారణం. ఈ బోర్డు వార్షికాదాయంతో పాటు ఆటగాళ్ల జీతాలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాయి. ఎందుకంటే మిగతా దేశ క్రికెటర్లతో పోలిస్తే మన ఆటగాళ్ల జీతాలు రెట్టింపుగా ఉంటాయి. ఇందులో ఆటగాళ్లను గ్రేడ్-ఏ ప్లస్, గ్రేడ్-ఏ, గ్రేడ్-బి, గ్రేడ్-సి గ్రూపులుగా విభజించి కాంట్రాక్టులు ఇస్తుంటుంది బీసీసీఐ. మరి ప్రస్తుతం భారత జట్టులో ఏ స్టార్ ఎంత జీతం తీసుకుంటున్నాడో తెలుసుకుందామా!

Team India salaries, టీమ్ఇండియా ఆటగాళ్ల జీతాలు
టీమ్ఇండియా

గ్రేడ్-ఏ ప్లస్

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా

గ్రేడ్-ఏ

రవి అశ్విన్, రవీంద్ర జడేజా, పుజారా, రహానే, ధావన్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, పంత్, హార్దిక్ పాండ్యా

గ్రేడ్-బి

సాహా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్

గ్రేడ్-సి

కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, గిల్, హనుమ విహారి, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, చాహల్, సిరాజ్

ఏ కేటరిగీకి ఎంత?

గ్రేడ్-ఏ ప్లస్​లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్లు అందుతాయి. అలాగే గ్రేడ్-ఏ వారికి రూ.5 కోట్లు, గ్రేడ్-బి ఆటగాళ్లకు రూ.3 కోట్లు, గ్రేడ్-సి క్రికెటర్లకు రూ.కోటి జీతంగా లభిస్తుంది.

మహిళా క్రికెటర్లకు ఎంత?

మహిళల జట్టు

Team India Women Salaries: పురుష క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్ల జీతాలు చాలా తక్కువగా ఉంటాయి. వారికి కోట్లలో వార్షికాదాయం లభిస్తుంటే వీరికి లక్షల్లోనే కాంట్రాక్టులు లభిస్తాయి. వీరికి గ్రేడ్-ఏ ప్లస్ ఉండదు. మరి భారత సీనియర్ మహిళల క్రికెటర్ల జీతాలు ఎలా ఉన్నాయో చూద్దామా!

గ్రేడ్-ఎ

హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్ యాదవ్

గ్రేడ్-బి

మిథాలీ రాజ్, జులాన్ గోస్వామి, దీప్తి శర్మ, పూనమ్ రౌత్, రాజేశ్వరి గైక్వాడ్, షెఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, తానియా భాటియా, రోడ్రిగ్స్

గ్రేడ్-సి

మన్సీ జోషి, అరుంధతి రెడ్డి, పుజా వస్త్రాకర్, హర్లీన్ డియోల్, ప్రియా పూనియా, రిచా ఘోష్

ఏ కాంట్రాక్టుకు ఎంత?

గ్రేడ్-ఎలోని ఆటగాళ్లకు ఏడాదికి రూ.50 లక్షలు, గ్రేడ్-బి క్రికెటర్లకు రూ.30 లక్షలు, గ్రేడ్-సిలోని వారికి రూ.10 లక్షలు లభిస్తాయి.

దేశవాళీ క్రికెటర్లకు ఎంత?

దేశవాళీ మ్యాచ్​

BCCI Domestic Salaries: గతేడాది దేశవాళీ క్రికెటర్లకు గుడ్​న్యూస్ చెప్పింది బీసీసీఐ. వారి మ్యాచ్ ఫీజును 50 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సీనియర్లు (కనీసం 40 మ్యాచ్‌లు ఆడిన అనుభవం) ఇకపై ప్రతి మ్యాచ్‌కు రూ.60 వేల వేతనం పొందనున్నారు. అండర్ 23 కేటగిరీ క్రికెటర్లు రూ.25 వేలు, అండర్ 19 కేటగిరీ క్రికెటర్లకు రూ.20 వేలు మ్యాచ్ ఫీజుగా లభించనుంది. రంజీ ట్రోఫీతో పాటు దులీప్ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడే పురుష క్రికెటర్లతో పాటు మహిళలకు కూడా కొత్త మ్యాచ్ ఫీజులు వర్తించనున్నాయి.

ఇవీ చూడండి

లెజెండ్స్ క్రికెట్ లీగ్​లో సెహ్వాగ్, యూవీ, భజ్జీ.. భారత జట్టిదే

2021లో టీమ్‌ఇండియాను ఆదుకున్నది ఈ ఇద్దరే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.