గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆఖరి టెస్టు మ్యాచ్‌ను ఆడేందుకు టీమ్ఇండియా సిద్ధమైంది. ఇందుకోసం టీమ్ఇండియా జట్టు గురువారం ఇంగ్లాండ్ బయలుదేరింది. ఇందుకు సంబంధించి ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో విరాట్ కోహ్లీ, జడేజా, పుజారా, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, శుభ్‌మన్ గిల్ మొదలైన ఆటగాళ్లు ఉన్నారు. ఈ మ్యాచ్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జూలై 1 నుంచి జరగనుంది. ఇప్పటికే భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది.
-
England bound ✈️
— BCCI (@BCCI) June 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
📸 📸: Snapshots as #TeamIndia takes off for England. 👍 👍 pic.twitter.com/Emgehz2hzm
">England bound ✈️
— BCCI (@BCCI) June 16, 2022
📸 📸: Snapshots as #TeamIndia takes off for England. 👍 👍 pic.twitter.com/Emgehz2hzmEngland bound ✈️
— BCCI (@BCCI) June 16, 2022
📸 📸: Snapshots as #TeamIndia takes off for England. 👍 👍 pic.twitter.com/Emgehz2hzm
కొత్త కెప్టెన్లు..: ఇంగ్లాండ్‌తో గతేడాది జరిగిన టెస్టు సమయానికి ఇప్పటికీ టీమ్ఇండియా జట్టులో చాలా మార్పులు జరిగాయి. ప్రధానంగా అప్పుడు జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేపట్టగా.. ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టులో కూడా ఇదే పరిస్థితి.. అప్పడు జో రూట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగా.. ఈ మ్యాచ్‌కు ఇటీవల టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న బెన్ స్టోక్స్ నాయకత్వం వహించనున్నాడు.
కోచ్‌ల విషయంలో కూడా రెండు జట్ల పరిస్థితి ఒకటే. గతేడాది సిరీస్ సమయంలో ఉన్న కోచ్‌లు ఇప్పుడు లేరు. వారి స్థానంలో కొత్త కోచ్‌లు బాధ్యతలు చేపట్టారు. టీమ్ఇండియాకు కోచ్‌గా గతేడాది సిరీస్‌లో రవిశాస్త్రి ఉంటే.. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ ఆ బాధ్యతలను చేపడుతున్నాడు. ఇంగ్లాండ్‌కు అప్పట్లే క్రిస్ సిల్వర్‌వుడ్ కోచ్‌గా ఉంటే ఇప్పుడు ఆ స్థానంలో బ్రెండన్ మెక్కల్లమ్ వచ్చాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్‌తో బిజీగా ఉన్న రిషభ్‌పంత్, శ్రేయస్ అయ్యర్లు ఈ మ్యాచ్‌లు ముగిశాక ఇంగ్లాండ్ టెస్టు కోసం జట్టులో చేరతారు.
ఇదీ చూడండి : టీమ్ఇండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య.. టీంలోకి త్రిపాఠి ఎంట్రీ