ETV Bharat / sports

Team India In Sri Lanka : కొలంబో చేరుకున్న రోహిత్ సేన.. ఎయిర్​పోర్టులో ఘన స్వాగతం - కొలంబో ఎయిర్​పోర్టుకు చేరుకున్న టీమ్ఇండియా

Team India In Sri Lanka : మినీ టోర్నమెంట్ ఆసియా కప్​లో పాల్గొనేందుకు టీమ్ఇండియా శ్రీలంక చేరుకొంది. కొలంబో ఎయిర్​పోర్టులో భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఇక భారత్ సెప్టెంబర్ 2న పల్లెకెలె వేదికగా.. దాయాది పాకిస్థాన్​తో తలపడనుంది.

Team India In Sri Lanka
Team India In Sri Lanka
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 5:39 PM IST

Updated : Aug 30, 2023, 8:03 PM IST

Team India In Sri Lanka : ఆసియా కప్ 2023 కోసం రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ఇండియా బృందం బుధవారం శ్రీలంక చేరుకుంది. కాసేపటి కిందటే కొలంబో ఎయిర్​పోర్టులో భారత ఆటగాళ్లు దిగారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య ఇతర ఆటగాళ్లతో సహా.. జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్​కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్​పోర్టు నుంచి ప్లేయర్లు నేరుగా హోటల్​కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

  • Team India has arrived in Sri Lanka for their Super 11 Men's ODI Asia Cup campaign. Their tournament begins against their arch-rivals to kick things off this Saturday. Who are you most looking forward to? #AsiaCup2023 pic.twitter.com/2UOENNPqyt

    — AsianCricketCouncil (@ACCMedia1) August 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆగస్టు 30 నుంచి ప్రారంభంకానున్న ఈ మినీ టోర్నమెంట్​కు సెప్టెంబర్ 17న తెరపడనుంది. టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 2న భారత్ తొలి మ్యాచ్​లో, దాయాది పాకిస్థాన్​ (Ind vs Pak Asia Cup 2023)తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్​కు స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్​ అందుబాటులో ఉండడని జట్టు మేనేజ్​మెంట్ ఇప్పటికే స్పష్టం చేసింది.

Asia Cup 2023 Pak vs Nepal : ఇక టోర్నీలో ముల్తాన్ వేదికగా.. పసికూన నేపాల్, వరల్డ్ నెం.1 వన్డే జట్టు పాక్ మధ్య మ్యాచ్​ బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. మ్యాచ్​కు ముందు స్టేడియంలో ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో నేపాల్​కు చెందిన త్రిషాలా గురుంజ్ (Trishala Gurung), పాకిస్థాన్​ సింగర్ అయిమా బేగ్(Aima Baig) పాల్గొని సందడి చేశారు. అయితే నేపాల్​.. తొలిసారి ఆసియా కప్​లో ఆడుతోంది. వారి దేశానికి మద్దతుగా నిలిచేందుకు నేపాల్ పౌరులు.. భారీగానే ముల్తాన్ స్టేడియానికి వచ్చారు.

Asia Cup India Titles : ఆసియా కప్​ హిస్టరీలో భారత్ అత్యధికంగా ఏడుసార్లు (6 సార్లు వన్డే, ఒకసారి టీ20 ఫార్మాట్) విజేతగా నిలిచింది. తర్వాత స్థానంలో శ్రీలంక ఆరు సార్లు (5 సార్లు వన్డే, ఒకసారి టీ 20 ఫార్మాట్​) విజేతలుగా నిలిచాయి. పాకిస్థాన్ రెండు సార్లు నెగ్గింది. ఇక ఈ టోర్నీ.. గత రెండు సీజన్లు (2016, 2022) టీ20 ఫార్మాట్లో జరగ్గా.. ఈసారి వన్డే ఫార్మాట్​లో జరుగుతోంది. ఇక ఈ టోర్నీలో భారత్ మ్యాచ్​లన్నింటికీ శ్రీలంకనే వేదికకానుంది.

Ind Vs Pak Asia Cup 2023 : క్రికెట్​ లవర్స్​కు షాకింగ్​ న్యూస్​.. సెప్టెంబర్​ 2 భారత్​ - పాక్​ మ్యాచ్​ లేనట్టేనా ?

Asia Cup Records : ఆసియాకప్​నకు వేళైంది.. ఈ 10 ఇంట్రెస్టింగ్​ పాయింట్స్​, రికార్డ్స్​ తెలుసా?

Last Updated : Aug 30, 2023, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.