ETV Bharat / sports

T20 World Cup: ఆదుకున్న సూర్యకుమార్.. సఫారీల లక్ష్యం ఎంతంటే? - టీ20 ప్రపంచకప్​ టీమ్​ఇండియా

T20 World Cup IND vs SA: టీ20 ప్రపంచకప్​లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా 133 పరుగులు సాధించింది. ప్రత్యర్థి జట్టుకు 134 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

india vs south africa match
india vs south africa match
author img

By

Published : Oct 30, 2022, 6:08 PM IST

T20 World Cup IND vs SA: టీ20 ప్రపంచకప్​లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్​లో టీమ్​ఇండియా బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో 9 వికెట్ల 133 నష్టానికి పరుగులు చేశారు. ప్రత్యర్థి సఫారీల జట్టుకు 134 లక్ష్యాన్ని భారత క్రికెట్​ జట్టు నిర్దేశించింది. టీమ్​ఇండియా బ్యాటర్​ సూర్యకుమార్​ యాదవ్​(68) టాప్​ స్కోరర్​గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలందరూ విఫలమయ్యారు.

తొలుత టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ (68) ఒక్కడే హాఫ్‌ సెంచరీతో రాణించాడు. రాహుల్‌ (9), రోహిత్‌ (15), కోహ్లీ (12), దీపక్‌ హుడా (0), హార్దిక్‌ (2), దినేశ్ కార్తీక్‌ (6), అశ్విన్‌(7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, పార్నెల్ 3, నోకియా 1 వికెట్‌ చొప్పున పడగొట్టారు.

మరోవైపు, టీమ్​ఇండియా మాజీ సారథి విరాట్​ కోహ్లీ.. టీ20 ప్రపంచకప్​ మ్యాచుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. ఆదివారం జరిగిన మ్యాచ్​లో 12 పరుగులు సాధించిన కోహ్లీ.. జయవర్దనే తర్వాత వెయ్యి పరుగులు బాదిన రెండో బ్యాటర్​గా నిలిచాడు.

ఇవీ చదవండి: పాకిస్థాన్​ బౌలర్ రాకాసి బౌన్సర్.. పగిలిన నెదర్లాండ్స్ బ్యాటర్ ముఖం!

ప్రపంచకప్​లో మరో ఆసక్తికర మ్యాచ్.. జింబాబ్వేపై అతికష్టం మీద బంగ్లా విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.