T20 World Cup Ind VS Eng: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో ఫైనల్‌లో తలపడే జట్టేదో తేల్చే మ్యాచ్.. ఆడిలైడ్ వేదికగా జరుగుతోంది. రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్ టీమ్ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ పూరైంది. నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి భారత్ 168 పరుగులు సాధించింది. ప్రత్యర్థి జట్టుకు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్య (63) దూకుడుగా ఆడేశాడు. విరాట్ కోహ్లీ (50) మరోసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ (27) ఫర్వాలేదనిపించినా ధాటిగా ఆడలేకపోయాడు. కేఎల్ రాహుల్ (5), రిషభ్ పంత్ (6), సూర్యకుమార్ (14) పెద్దగా రాణించలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జొర్డాన్ 3.. క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు.
విరాట్ రికార్డు..
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించాడు.
తొలి ఆటగాడిగా..
బుధవారం జరుగుతున్న మ్యచ్‌లో కోహ్లీ మరో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో మూడు అర్ధ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2014లో మిర్పుర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో విరాట్(72*) పరుగులు సాధించాడు. 2016 ప్రపంచకప్‌లో ముంబయిలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 89 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.