ETV Bharat / sports

చరిత్ర తిరగరాసిన బాబర్​ ఆజామ్​.. తండ్రి కన్నీటి పర్యంతం - బాబర్‌ అజామ్‌ తండ్రి ఏడుపు వీడియో

ప్రపంచకప్‌ టోర్నీలో భారత్​పై పాక్​ గెలిచిన అనంతరం పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ తండ్రి అజామ్‌ సిద్దిఖి భావోద్వేగానికి లోనయ్యాడు. తన కుమారుడి చిరస్మరణీయ ఆట పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Babar Azam's father tears
బాబర్‌ అజామ్‌ తండ్రి కన్నీటి పర్యంతం
author img

By

Published : Oct 26, 2021, 8:33 AM IST

ప్రపంచకప్‌ టోర్నీ(T20 world cup) చరిత్రలో టీమ్‌ఇండియాపై పాకిస్థాన్‌(IND vs PAK) తొలి విజయం సాధించడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారత్‌పై పది వికెట్ల తేడాతో పాక్‌ గెలవగానే దుబాయ్‌ స్టేడియం మొత్తం ఆ దేశ అభిమానుల సందడితో హోరెత్తింది. ఈ క్రమంలోనే అదే స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ తండ్రి అజామ్‌ సిద్దిఖి భావోద్వేగానికి లోనయ్యాడు. తన కుమారుడి చిరస్మరణీయ ఆట పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

  • This is Babar Azam’s father. So happy for him. I first met him in 2012 at Adnan Akmal’s walima. Babar at that time was 3 years away from Pakistan debut. I clearly remember what his father told me “bas debut ho jane do. Agay sara maidaan babar ka hai” pic.twitter.com/ZlsvODQkSg

    — Mazher Arshad (@MazherArshad) October 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎంతైనా ఒక కుమారుడు గొప్ప పని చేస్తే ఏ తండ్రి అయినా ఇలాగే గర్వపడతారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగినా పరాభవం పాలైంది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 151/7 స్కోరే సాధించింది. అనంతరం పాక్‌ 17.5 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఓపెనర్లు రిజ్వాన్‌ (79*), బాబర్‌ (68*) పాక్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత (12-1) ఆధిపత్యానికి తెరదించారు. దిగ్గజాలకు సాధ్యం కాని ఈ రికార్డును బాబర్‌ ఈ మ్యాచ్‌తో తిరగరాశాడు. ఈ క్రమంలోనే అతడి తండ్రి పట్టరాని సంతోషంలో మునిగిపోయారు.

ఇదీ చూడండి: కోహ్లీ, ధోనీ క్రీడాస్ఫూర్తి.. భారత్‌ - పాక్‌ జట్లపై ఐసీసీ హర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.