ETV Bharat / sports

T20 world cup: రెండో సెమీస్​ పోరు.. టాస్ నెగ్గిన ఇంగ్లాండ్​.. భారత్​ బ్యాటింగ్​ - టీ20 ప్రపంచకప్​ ఇంగ్లాండ్ టీమ్ఇండియా

టీ20 ప్రపంచకప్​లో భాగంగా మరి కాసేపట్లో రెండో సెమీస్​ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్​ బౌలింగ్ ఎంచుకుంది. టీమ్​ఇండియా బ్యాటింగ్​కు దిగనుంది.

T20 world cup 2022 Semi final Teamindia won the toss
టీ20 ప్రపంచక్​ సెమీఫైనల్​
author img

By

Published : Nov 10, 2022, 1:13 PM IST

Updated : Nov 10, 2022, 1:52 PM IST

టీ20 ప్రపంచకప్​ టోర్నీని టీమ్​ఇండియా ముద్దాడాలంటే నేడు జరగనున్న రెండో సెమీస్​లో గెలవాల్సిందే. ఇంగ్లీష్ జట్టుపై విరుచుకుపడాల్సిందే. కాగా, ఈ మ్యాచ్​లో భాగంగా ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్​ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టుకు బ్యాటింగ్​కు దిగనుంది. అయితే అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య పోరు రికార్డు గట్టిగా ఉంది. గతంలో ఈ రెండు జట్లు 22 సార్లు తలపడగా.. విజయాలు దాదాపు సమంగానే ఉన్నాయి. సెమీస్‌ పోరు సందర్భంగా గతంలో ఇరు జట్ల ప్రదర్శనలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..

  • అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌, ఇంగ్లాండ్‌ ఇప్పటివరకు 22 సార్లు ఢీకొన్నాయి. వీటిలో భారత్‌ 12 సార్లు గెలవగా.. ఇంగ్లాండ్‌ 10సార్లు విజయం సాధించింది.
  • ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 3 మ్యాచ్‌ సిరీస్‌ను టీమిండియా 2-1తో చేజిక్కించుకుంది. ఇక గతేడాది మార్చిలో సొంతగడ్డపై జరిగిన 5 టీ20ల సిరీస్‌లో 3-2తో పైచేయి సాధించింది.
  • భారత్, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన చివరి ఐదు టీ20 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా నాలుగు సార్లు విజయం సాధించగా.. ఇంగ్లాండ్‌ ఒక్కసారే గెలిచింది.
  • ఈ ఏడాది జులైలో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్‌పై ఇంగ్లాండ్‌ 215 పరుగుల అత్యధిక స్కోరు సాధించింది.
  • ఇక టీ20 ప్రపంచకప్‌లో ఇరుజట్లు మూడుసార్లు (2007, 2009, 2012) తలపడ్డాయి. అందులో భారత్‌ రెండు, ఇంగ్లాండ్‌ ఒక మ్యాచ్‌ గెలిచాయి.
  • డర్బన్‌ వేదికగా 2007 సెప్టెంబర్‌ 19న జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. తొలుత టీమ్‌ఇండియా 218/4 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌కు దిగి 200/6 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లోనే స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో యువరాజ్‌సింగ్‌ (58) ఆరు బంతుల్లో ఆరు సిక్సుల రికార్డు సృష్టించాడు. 12 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.
  • రెండో మ్యాచ్‌.. 2009 ప్రపంచకప్‌లో లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో జరిగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తడబడి 150/5 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్‌ చేతిలో 3 పరుగుల తేడాతో ఓడిపోయింది.
  • ఇక మూడో మ్యాచ్‌.. 2012 ప్రపంచకప్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో 90 పరుగుల భారీ తేడాతో భారత్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 170/4 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ 14.4 ఓవర్లలో 80 పరుగులకే ఆలౌటైంది. భారత్‌పై ఇంగ్లీష్‌ జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే.
  • ఇంగ్లాండ్‌పై విరాట్‌ కోహ్లీ అత్యధికంగా 589 పరుగులు చేశాడు. ఆ తర్వాత రోహిత్‌ శర్మ 383 పరుగులు సాధించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా 117 పరుగులతో ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.
  • ఇక అత్యధిక వికెట్లు పడగొట్టింది యుజ్వేంద్ర చాహల్‌. 11 మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యా 13 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు, భువి 9 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు.
  • భారత్‌పై జోస్‌ బట్లర్‌ అత్యధికంగా 395 పరుగులు సాధించాడు. అలెక్స్‌ హేల్స్‌ 245 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియాపై అత్యధిక వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌. 14 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు. మెయిన్‌ అలీ 8 మ్యాచ్‌ల్లో 7, అదిల్ రషీద్‌ 11 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు పడగొట్టారు.

భారత జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
ఇంగ్లాండ్ జట్టు: జోస్​ బట్లర్​, అలెక్స్​ హేల్స్​, ఫిలిప్​ సాల్ట్​, బెన్​ స్టోక్స్​, హ్యారీ బ్రూక్​, లియామ్​ లివింగ్​స్టోన్, మెుయిన్ అలీ​, సామ్​ కరన్​, క్రిస్​ జొర్డాన్​, క్రిస్​ వోక్స్​, అదిల్​ రషీద్

ఇదీ చూడండి: 'ఫైనల్​లో భారత్‌ అడుగుపెడితే..?'.. బాబర్‌ రియాక్షన్​ ఇదే

'ఫైనల్​లో భారత్‌ అడుగుపెడితే..?'.. పాక్​ కెప్టెన్​ రియాక్షన్​ ఇదే

Last Updated : Nov 10, 2022, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.