ETV Bharat / sports

T20 WC 2022: 'ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌' రేసులో 9 మంది.. కోహ్లీతో పాటు.. - టీ20 ప్రపంచకప్​ అప్డేట్లు

T20 World Cup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్​ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు కోసం పోటీలో నిలిచిన తొమ్మిది మంది క్రికెటర్ల పేర్లను ఐసీసీ వెల్లడించింది. తమకు నచ్చిన ఆటగాడికి ఓటు వేసే అవకాశాన్ని అభిమానులకు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ రేసులో ఎవరెవరు ఉన్నారంటే?

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Nov 11, 2022, 4:37 PM IST

T20 World Cup 2022 Player Of The Tournament: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న ప్రారంభమైన టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. మెల్‌బోర్న్‌ వేదికగా నవంబరు 13న ఇంగ్లాండ్‌, పాకిస్థాన్​ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్‌ ముగియనుంది. ఈ నేపథ్యంలో 'ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌' అవార్డు కోసం పోటీలో నిలిచిన తొమ్మిది మంది క్రికెటర్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తాజాగా వెల్లడించింది.

ఈ జాబితాలో ఉన్న తమకు నచ్చిన ఆటగాడికి ఓటు వేసే అవకాశాన్ని అభిమానులకు కల్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటన చేసింది. కాగా ఈ లిస్టులో భారత్‌ నుంచి ఇద్దరు, పాకిస్థాన్‌ నుంచి ఇద్దరు, ఇంగ్లాండ్‌ నుంచి ముగ్గురు, జింబాబ్వే నుంచి ఒకరు, శ్రీలంక నుంచి ఒకరు చోటు దక్కించుకున్నారు.

ఐసీసీ షార్ట్‌లిస్టులో ఉన్న క్రికెటర్లు వీరే

  1. విరాట్‌ కోహ్లీ (భారత్‌)- 296 పరుగులు- 6 మ్యాచ్‌లు
  2. సూర్యకుమార్‌ యాదవ్‌ (భారత్‌)- 239 పరుగులు- 6 మ్యాచ్‌లు
  3. షాదాబ్‌ ఖాన్‌ (పాకిస్థాన్‌)- 10 వికెట్లు, ఒక అర్ధ శతకం- 6 మ్యాచ్‌లు
  4. షాహిన్‌ ఆఫ్రిది (పాకిస్థాన్‌)- 10 వికెట్లు- 6 మ్యాచ్‌లు
  5. సామ్‌ కరన్‌ (ఇంగ్లాండ్‌)- 10 వికెట్లు- 5 మ్యాచ్‌లు
  6. జోస్‌ బట్లర్‌ (ఇంగ్లాండ్‌)- 199 పరుగులు- 5 మ్యాచ్‌లు- కెప్టెన్‌గా సెక్సెస్​
  7. అలెక్స్‌ హేల్స్‌ (ఇంగ్లాండ్‌)- 211 పరుగులు- 5 మ్యాచ్‌లు
  8. సికిందర్‌ రజా(జింబాబ్వే)- 219 పరుగులు-8 మ్యాచ్‌లు- 10 వికెట్లు
  9. వనిందు హసరంగ (శ్రీలంక)- 15 వికెట్లు- 8 మ్యాచ్‌లు

అదరగొట్టిన కోహ్లీ, సూర్య..
ఈ మెగా టీ20 టోర్నీలో టీమ్​ఇండియా.. సెమీస్‌ దశలోనే ఇంటిబాట పట్టినప్పటికీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, మిడిలార్డర్‌ మేటి బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సూపర్‌-12 దశ ముగిసే సరికి కోహ్లీ 246 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలువగా.. సూర్య 225 పరుగులతో టాప్‌-10 జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.