ETV Bharat / sports

భారీ సిక్సర్​.. స్టేడియం బయటకు బంతి.. కళ్లు చెదిరేలా సూపర్​ క్యాచ్​ - వాషింగ్టన్ ఫ్రీడమ్‌ వర్సెస్ టెక్సాస్ సూపర్ కింగ్స్

తాజాగా జరిగిన ఓ మ్యాచ్​లో ఓ భారీ సిక్సర్​, కళ్లు చెదిరే సూపర్​ క్యాచ్​ నమోదైంది. అది చూసిన క్రికెట్​ అభిమానులను ప్లేయర్లను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఆ వీడియోస్ మీకోసం..

major league cricket 2023
భారీ సిక్సర్​.. స్టేడియం బయటకు బంతి.. కళ్లు చెదిరేలా సూపర్​ క్యాచ్​
author img

By

Published : Jul 17, 2023, 10:41 AM IST

క్రికెట్​లో.. ఫోర్లు, సిక్స్​లతో బ్యాటర్ల ధనాధన్​ ఇన్నింగ్స్​, బౌలర్ల మ్యాజిక్​ బౌలింగ్​, సూపర్​ క్యాచ్​లతో ఫీల్డర్ల విన్యాసాలు చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటివే రెండు మ్యాచుల్లో నమోదయ్యాయి. ఓ భారీ సిక్సర్​, కళ్లు చెదిరే సూపర్​ క్యాచ్​ నమోదైంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. అది చూసిన క్రికెట్​ అభిమానులను ప్లేయర్లను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.

major league cricket 2023 : భారీ సిక్సర్... మేజర్ లీగ్ క్రికెట్‌ - 2023లో ఆదివారం వాషింగ్టన్ ఫ్రీడమ్‌ - టెక్సాస్ సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో టెక్సాస్​ సూపర్​ కింగ్స్ ఓడిపోయింది. 6 పరుగుల తేడాతో పరాజయం అందుకుంది. 163 లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్​ సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో 39 బంతుల్లో 76 పరుగులు చేసినప్పటికీ వృథా అయిపోయింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌, డెవాన్‌ కాన్వే సహా మిగతా వారు ఫెయిల్ అయ్యారు. ఓ దశలో 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సూపర్‌ కింగ్స్​ను.. క్రీజులోకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యర్ది బౌలర్లకు చెమటలు పట్టించాడు బ్రావో. 5 ఫోర్లు, 6 సిక్స్‌లు బాదాడు. ఆఖరి ఓవర్‌లో విజయానికి 27 పరుగులు అవసరమవ్వగా.. 20 పరుగులు చేశాడు. కానీ ఆరు పరుగులు చేయలేకపోవడం వల్ల జట్టు ఓడిపోయింది.

dj bravo six : అయితే తన ఇన్నింగ్స్​లో బ్రావో.. ఓ భారీ సిక్సర్‌ బాదాడు. ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌ అన్రిచ్‌ నోర్జే బౌలింగ్‌లో.. ఏకంగా 103 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. నోర్జే షార్ట్‌పిచ్‌ డెలివరీ సంధించగా.. బ్రావో లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్‌ కొట్టాడు. ఆ బంతి కాస్త స్టేడియం బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో ట్రెండ్ అవుతోంది.

Imam ul haq catch : సూపర్ క్యాచ్​.. ఇక పాకిస్థాన్​-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో కళ్లు చెదిరే క్యాచ్‌ నమోదైంది. పాక్‌ ప్లేయర్​ ఇమామ్‌ ఉల్‌ హాక్‌ ఈ క్యాచ్​ను ఒడిసిపట్టాడు. షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న అతడు.. గాల్లోకి ఎగిరి అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ తన చేతిలోకి అందుకున్నాడు. అఘా సల్మాన్‌ బౌలింగ్‌లో సమరవిక్రమ బంతిని బాదగా.. ఇమామ్‌ ఈ సూపర్‌ క్యాచ్‌ పట్టాడు. ఇమామ్‌ ఫీట్​కు ఫిదా అయిపోయిన క్రికెట్‌ అభిమానులు అతడిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. వాటే క్యాచ్‌ అంటూ లైక్స్​ కొడుతూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

Pakisthan Srilanka match : ఇక ఇమామ్‌ క్యాచ్‌ అందుకోగానే అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. మ్యాచ్​ను​ పలుసార్లు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మొదటి రోజు కేవలం 65.4 ఓవర్ల ఆట మాత్రమే నిర్వహించడానికి సాధ్యమైంది. ఆట పూర్తయ్యే సమయానికి లంక తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 242 రనస్​ చేసింది. ధనంజయ డిసిల్వ 94 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి పాకిస్థాన్​ను బౌలింగ్​కు ఆహ్వానించింది. డిసిల్వ, ఏంజెలో మాథ్యూస్‌ (64) హాఫ్​సెంచరీలతో ఆకట్టుకున్నారు. నిషాన్‌ మధుష్క (4), కుశాల్‌ మెండిస్‌ (12), దినేశ్‌ చండీమాల్‌ (1) ఫెయిల్ అయ్యారు. దిముత్‌ కరుణరత్నే (29), సదీర సమరవిక్రమ (36) పర్వేలేదనిపించారు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది 3 వికెట్లు తీయగా.. నసీం షా, అబ్రార్‌ అహ్మద్‌, అఘా సల్మాన్‌ చెరో వికెట్ తీశారు.

ఇదీ చూడండి :

వింబుల్డన్‌ కోటలో కొత్తరాజు.. జకోవిచ్‌పై సంచలన విజయం

'చాహల్ ఎవరో నాకు తెలీదు.. ఆ ఒక్క మాటతో నచ్చేశాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.