ETV Bharat / sports

సిరాజ్​ వల్లే అతనితో గొడవ జరిగింది: రియాన్​ పరాగ్​ - సిరాజ్​ రియాన్ పరాగ్​ గొడవ

Harshal patel Riyan parag fight: ఈ ఐపీఎల్​లో ఆర్సీబీ ఆటగాడు హర్షల్​ పటేల్​తో జరిగిన గొడవ గురించి వివరించాడు రాజస్థాన్​ ప్లేయర్​ రియాన్ పరాగ్​. ఈ గొడవ జరగడానికి సిరాజ్​ ఓ కారణమని చెప్పాడు

siraj parag fight
సిరాజ్​ పరాగ్​ గొడవ
author img

By

Published : Jun 6, 2022, 12:06 PM IST

Harshal patel Riyan parag fight: ఐపీఎల్​ 2022లో హర్షల్ పటేల్​(ఆర్సీబీ)- రియాన్​ పరాగ్​(రాజస్థాన్) మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయమై మాట్లాడాడు పరాగ్​. ఈ వాగ్వాదం జరగడానికి సిరాజ్​ తనను ప్రేరేపించాడని అన్నాడు.

"గతేడాది ఐపీఎల్​లో హర్షల్​ బౌలింగ్​లో ఔట్ అయ్యాను. అప్పుడు నన్ను అక్కడి నుంచి వెళ్లిపో అన్నట్లుగా హర్షల్​ సైగా చేశాడు. అది నేను మైదానంలో చూడలేదు. ఆ తర్వాత డగౌట్​లో చూపించిన రిప్లేలో చూశాను. అప్పటినుంచి అది నా మనసులో ఉండిపోయింది. ఈ సీజ్​న్​లో అతడి బౌలింగ్​లో నేను బాగా ఆడాను. అందుకే నేను కూడా అలానే సైగ చేశా. ఎవరినీ తిట్టలేదు. అయితే అక్కడే ఉన్న సిరాజ్​ నన్ను పిలిచి 'నువ్వు పిల్లాడివి.. పిల్లాడిలా ప్రవర్తించు' అని అన్నాడు. 'నేను మిమ్మల్ని ఏమి అనలేదు భయ్యా' అన్నాను. అంతలోనే ఇద్దరు కలిసి నా మీదక వచ్చారు. అది కాస్త గొడవకు దారి తీసింది. ఆ తర్వాత మా వాళ్లు నన్ను పక్కకి తీసుకెళ్లారు. మ్యాచ్​ ముగిశాక జరిగిందంతా మర్చిపోయి హర్షల్​కు షేక్ హ్యాండ్​ ఇచ్చినా అతను తీసుకోలేదు. అతనికి పరిపక్వత లేదనిపించింది" అని పరాగ్ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: ఆనంద్​ జోరు.. ఐదో రౌండ్​లో ప్రపంచ నెం.1పై గెలుపు​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.