ETV Bharat / sports

Shubman Gill Health Condition : ఆస్పత్రి నుంచి శుభ్​మన్ గిల్​ డిశ్చార్జి.. భారత్​Xపాక్​ మ్యాచ్‌కు డౌటే! - ఐసీసీ వన్డే వరల్డ్​ కప్​ 2023

Shubman Gill Health Condition : వన్డే వరల్డ్ కప్ 2023​లో భాగంగా భారత్​ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో ఆక్టోబర్​ 14న తలపడనుంది. అయితే కొద్ది రోజులుగా జ్వరంలో బాధపడుతున్న టీమ్ఇండియా ఓపెనర్ శుభ్​మన్ గిల్​ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్​కు దూరమయ్యాడు. అఫ్గాన్​తో మ్యాచ్​కు కూడా అందుబాటులో లేడు. అయితే పాక్​తో మ్యాచ్​లో కూడా గిల్​ ఆడటం అనుమానమే!

Shubman Gill Health Condition
Shubman Gill Health Condition
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 1:00 PM IST

Shubman Gill Health Condition : వరల్డ్​ కప్​ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్​లో భారత్​ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఊపుమీదున్న టీమ్​ఇండియాకు​ గట్టి షాక్​ తగిలింది. జట్టు ఓపెనర్ శుభ్​మన్ గిల్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. గత కొద్ది రోజులుగా డెంగీ జ్వరంతో గిల్​ బాధపడుతున్నాడు. "ప్లేట్‌లెట్ కౌంట్ 70,000కు పడిపోవడం వల్ల ముందు జాగ్రత్తగా గిల్‌ను ఆదివారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అవసరమైన టెస్టులు నిర్వహించారు. సోమవారం అతడిని డిశ్చార్జ్‌ చేశారు" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గిల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీమ్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అయితే అనారోగ్యం కారణంగా గిల్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్​కు దూరమయ్యాడు. బుధవారం జరగబోయే అఫ్గాన్​తో మ్యాచ్​కు కూడా అందుబాటులో ఉండటం లేదు.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌కూ డౌటే!
India Vs Pakistan World Cup 2023 : గుజరాత్​లోని అహ్మదాబాద్​ వేదికగా అక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ హైవోల్టేజీ మ్యాచ్‌కు గిల్ దూరమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం డెంగీ జ్వరంతో బాధపడుతున్న గిల్.. కోలుకోవడానికి కాస్త సమయం పట్టనుంది. ఇక పాక్‌తో మ్యాచ్‌కు నాలుగు రోజుల సమయమే ఉంది. దీంతో ఆ మ్యాచ్‌లో గిల్ ఆడటం దాదాపు సాధ్యం కాకపోవచ్చు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గిల్ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనింగ్ చేశాడు. శుభ్‌మన్ గిల్ అందుబాటులోకి వచ్చేవరకు రోహిత్‌తో కలిసి ఇషాన్ ఓపెనింగ్ చేస్తాడు. అయితే శుభ్​మన్​ పూర్తిగా వరల్డ్​కప్ స్క్వాడ్​ నుంచి తొలగిస్తే.. సెలక్టర్లు రుతురాజ్​ గైక్వాడ్​ వైపు చూసే అవకాశం ఉంది. ఎందుకంటే మెగా టోర్నీకి ముందు ఆసీస్​తో సిరీస్​లో రుతురాజ్​ ఓపెనర్​గా అద్భుత ప్రదర్శన చేశాడు. గైక్వాడ్​ తర్వాత సూపర్​ ఫామ్​లో ఉన్న యంగ్​ ప్లేయర్ యశస్వి జైస్వాల్​ను ఎంపిక చేసే అవకాశం ఉంది.

ICC World Cup 2023 : ఆసీస్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమ్​ఇండియా శుభారంభం చేసింది. ఇక బుధవారం అఫ్గాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఆసీస్​తో జరిగిన పోరులో మన బౌలర్లు అదరగొట్టినా.. బ్యాటింగ్‌లో రోహిత్‌, ఇషాన్‌, శ్రేయస్ అయ్యర్ డకౌట్‌ కావడం ఫ్యాన్స్​ను కొంత ఆందోళనకు గురిచేసింది. వారు అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో రాణించాలని కోరుకుంటున్నారు.

ODI World Cup 2023 : శుభ్‌మన్ గిల్ హెల్త్ రిపోర్ట్​.. ఆఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్ ఆడటంపై బీసీసీఐ క్లారిటీ

Ind Vs Pak World Cup 2023 : భారత్​-పాక్​ మ్యాచ్​.. 11 వేల మంది సిబ్బందితో భద్రత.. న్యూక్లియర్​ దాడి జరిగినా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.