ETV Bharat / sports

గతేడాది ఆరెంజ్​ క్యాప్​​.. ఈసారి 20 పరుగులు కూడా చేయలేక..!

author img

By

Published : Apr 9, 2022, 8:00 PM IST

ఎందరో ఆటగాళ్లు ఐపీఎల్​లో​ అద్భుత ప్రదర్శనతో టీమ్​ఇండియాలో చోటు సంపాదించారు. అక్కడా ఇక్కడా రాణించిన వారున్నారు. నిలకడలేమితో ఒకప్పటి స్టార్లు.. జీరోలు అయిన సందర్భాలూ ఉన్నాయి. 2021 ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ విజేతగా నిలవడానికి ప్రధాన కారణమైన రుతురాజ్ గైక్వాడ్​.. ఈసారి రాణించలేకపోతున్నాడు. నాలుగు మ్యాచ్​ల్లో కలిపి 20 పరుగులు కూడా చేయలేదు.

Ruturaj Gaikwad's poor form continues
Ruturaj Gaikwad's poor form continues

Ruturaj Gaikwad Poor Form: రుతురాజ్​ గైక్వాడ్​.. ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ తరఫున విజయవంతమైన ఆటగాడు. గతేడాది అత్యద్బుత ప్రదర్శనతో చెన్నై టైటిల్​ విజేతగా నిలవడంలో ఇతడిది ప్రధాన పాత్రగా చెప్పొచ్చు. మొత్తంగా 16 మ్యాచ్​ల్లో 635 పరుగులు చేసి లీగ్​లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆరెంజ్​ క్యాప్​ సొంతం చేసుకున్నాడు. చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత టీమ్​ఇండియాలోనూ చోటు సంపాదించాడు. ఐపీఎల్​లో ఇతడికి తోడు ఫాఫ్​ డుప్లెసిస్​(633 పరుగులు) కూడా దూకుడుగా ఆడాడు. దాదాపు ప్రతిమ్యాచ్​లోనూ శుభారంభంతో చెన్నైకి భారీ స్కోరు అందించి.. విజయాల్లో కీలకంగా నిలిచారు. ఈసారి ఐపీఎల్​లో ఫాఫ్​ను వేలంలో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు దక్కించుకుంది. మరోవైపు.. ఈసారీ చెన్నై తరఫునే ఆడుతున్న గైక్వాడ్​ వరుసగా విఫలమవుతున్నాడు. ఆడిన 4 మ్యాచ్​ల్లో కలిపి 18 పరుగులే చేశాడు.

Ruturaj Gaikwad
రుతురాజ్​ గైక్వాడ్​

తొలుత కోల్​కతా నైట్​రైడర్స్​తో మ్యాచ్​లో డకౌట్​ అయ్యాడు. ఆ తర్వాత లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​పై 1, పంజాబ్​పై 1, సన్​రైజర్స్​పై 16 పరుగులు చేసి అవుటయ్యాడు. దాదాపు అన్నింట్లోనూ నిర్లక్ష్యంగా వికెట్​ పారేసుకున్నాడు గైక్వాడ్​. ఇతడి ఫామ్​ ఇప్పుడు చెన్నైని కలవరపెడుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్​ల్లో ఓడిపోయింది. గతంలో బ్యాటింగ్​లో డుప్లెసిస్​, గైక్వాడ్​, మొయిన్​ అలీ.. చెన్నైకి వెన్నెముకగా నిలిచారు. ఈసారి గైక్వాడ్​ వైఫల్యంతో.. మొత్తం భారం అలీపైనే పడుతుంది. రాయుడు, జడేజా కూడా నిలకడగా ఆడలేకపోతున్నారు. బౌలింగ్​లోనూ కోట్లు పెట్టి కొనుక్కున్న దీపక్​ చాహర్​ దూరమవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. మరో ఆల్​రౌండర్​ శార్దుల్​ ఠాకుర్​ను వేలంలో దిల్లీ దక్కించుకుంది. బ్రావో వయసు మీద పడుతుంది. ఫలితంగా.. బౌలింగ్​లోనూ తేలిపోతుంది. ఇదే ఇప్పుడు చెన్నైని దెబ్బతీస్తుంది.

గైక్వాడ్​ఆడితేనే: 2021లో గైక్వాడ్​ ప్రదర్శనతో ఈసారి కూడా అతడిపై నమ్మకంతో చెన్నై అట్టిపెట్టుకుంది. బ్యాటింగ్​లో అపారమైన ప్రతిభ కలిగిన ఇతడిని.. పలువురు మాజీలు, క్రికెట్​ విశ్లేషకులు టీమ్​ఇండియా భవిష్యత్​ స్టార్​గా అభివర్ణించారు. దానిని నిరూపించుకోవాలంటే.. గైక్వాడ్​ బ్యాట్​ ఝులిపించాల్సిన అవసరం ఉంది. లేకుంటే చెన్నై ఈ సీజన్​లో కోలుకోవడం కష్టమే. మరికొన్ని మ్యాచ్​ల్లో విఫలమైతే.. జట్టులో అతడికి చోటు కూడా కష్టమే. మరి రాబోయే మ్యాచ్​ల్లో రుతురాజ్​ రాణిస్తాడో చూడాలి.

ఇవీ చూడండి: ఫేమస్​ క్రికెటర్లే.. ఐపీఎల్​లో ఒక్క మ్యాచ్​ కూడా ఆడలేకపోయారు!

రవిశాస్త్రి సీరియస్​.. అతడిపై జీవితకాల నిషేధం విధించాలని..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.