ETV Bharat / sports

నేను కూడా బ్యాడ్​ కెప్టెనే ప్రస్తుతం నా ఫోకస్​ దానిపైనే! : రోహిత్ శర్మ

Rohit Sharma World Cup 2023 : వరల్డ్​ కప్​ టోర్నీలో భాగంగా మంబయి వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌కు సిద్ధంగా ఉంది టీమ్ఇండియా. ఈ సందర్భంగా భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ తాజాగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక విషయాలపై మాట్లాడాడు.

Rohit Sharma World Cup 2023
Rohit Sharma World Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 12:09 PM IST

Rohit Sharma World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ముంబయి వేదికగా శ్రీలంకతో తలపడేందుకు టీమ్​ఇండియా సిద్ధమైంది. వరుసగా ఆరు విజయాలను నమోదు చేసిన రోహిత్​ సేన ఇప్పుడు సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కెప్టెన్ రోహిత్ తన వ్యక్తిగత ప్రదర్శనతో పాటు నాయకత్వ బాధ్యతలతో భారత జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన కెప్టెన్సీ స్టైల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రోహిత్.

"పరిస్థితులును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నిర్ణయాలను తీసుకుంటాను. ప్రతి చిన్న విషయంపైనా విశ్లేషణ చేసి అందుకు తగ్గట్టుగా ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అవి మంచి ఫలితాలు చూపవచ్చు. లేదా మరికొన్నిసార్లు ప్రయోజనం లేకపోవచ్చు. కానీ, మన దగ్గర నుంచి ప్రయత్న లోపం మాత్రం ఉండకూడదు. ప్రతి మ్యాచ్‌కు తగినంత సన్నద్ధత అవసరం. మైదానంలో తీసుకునే నిర్ణయాలు విజయం కోసం మాత్రమే అని నేను నమ్ముతాను. ప్రత్యర్థి జట్ల బలాలు ఏంటి? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారేం చేస్తారు? అనే దిశగానూ నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఇదే విషయన్ని బౌలర్లకూ చెబుతుంటాను. ఇప్పటి వరకు సమష్టిగా మేము చేసింది ఇదే. వికెట్ల కోసం వెళ్లడం లేదా బ్యాటర్లను పరుగులు చేయకుండా అడ్డుకొనేందుకు ఫీల్డింగ్‌లో చురుగ్గా మార్పులు చేయడం కీలకమని నేను భావిస్తున్నాను. చిన్నపాటి మార్పులు, వ్యూహాత్మక నిర్ణయాల వల్ల గేమ్‌‌లో మనం ఆధిక్యత ప్రదర్శించేందుకు అవకాశాలు కూడా లభిస్తాయి. దానికి తగ్గట్టు వ్యూహ రచనలో సహచర ఆటగాళ్లు కూడా భాగస్వాములు కావడం చాలా ముఖ్యం. ఇది ఏ మాత్రం తేలికైన విషయం కాదు. వారు పాటించకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి అర్థం ఉండదు. జట్టు విజయాల్లో నాతో పాటు మిగతా పది మందికీ ఈ క్రెడిట్​ను ఇవ్వాలి. జట్టు నిర్ణయాలకు కట్టుబడి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లేది కూడా వారే. ఇది కేవలం కెప్టెన్‌గా నా ఒక్కడి ఆలోచన అయితే కాదు. ఇప్పుడున్న పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి కాబట్టి అంతా ఓకే. ప్రతి మ్యాచ్‌ ఫలితంపై నాకు అవగాహన ఉంది. వరుసగా విజయాలు సాధిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది కనిపించదు. అయితే, ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా బ్యాడ్‌ కెప్టెన్‌గా కనిపిస్తాను. ఇప్పటికైతే జట్టు విజయం కోసం ఏం అవసరమనే దానిపైనే దృష్టిసారించాను" అని రోహిత్ శర్మ వెల్లడించాడు.

జట్టు కోసం నిస్వార్థంగా బ్యాటింగ్‌ చేసే రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్లు కీలక సూచనలు చేశారని.. అతడ్ని కాస్త స్వార్థపూరితంగా బ్యాటింగ్‌ చేయాలని చెప్పినట్లు విలేకర్లు భారత సారథి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు కాసేపు వేచి చూసిన రోహిత్.. ఆ తర్వాత టీమ్‌ మేనేజర్‌ వైపు చూడటంతో హాలంతా నవ్వులు విరిశాయి.

  • Heartiest congratulations to Team India on their remarkable sixth consecutive victory in #CWC2023! Skipper @ImRo45's gritty 87-run innings on a challenging batting surface showcased exceptional skill and determination. Kudos to @MdShami11 for his outstanding bowling, claiming 4… pic.twitter.com/PrZFPLlkoM

    — Jay Shah (@JayShah) October 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఎల్లవేళలా నా బ్యాటింగ్‌ను నేను ఆస్వాదిస్తాను. అయితే, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకానీ, ఇష్టమొచ్చినట్లు నేను బ్యాటింగ్‌ చేయలేను. టీమ్ మెరుగైన స్థితికి చేరే వరకూ మంచి ఇన్నింగ్స్​ను ఆడాల్సి ఉంటుంది. అలానే ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఓ ఓపెనర్‌గా నేను ఇన్నింగ్స్‌ను సున్నా నుంచి ప్రారంభిస్తాను. మ్యాచ్‌లో మంచి స్థితిలో జట్టు నిలవాలంటే ఆరంభం బాగుండాలి. పవర్‌ప్లేను అందుకు వినియోగించుకుంటాం. కానీ, ఒక్కోసారి పవర్‌ ప్లేలోనూ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. గత మ్యాచ్‌లో త్వరగా మూడు వికెట్లను కోల్పోయాం. అప్పుడు గేమ్‌ను మార్చాల్సిన అవసరం కూడా ఉంది. బ్యాటర్‌గా జట్టు కోసం ఏం చేయాలనేది ఆలోచిస్తాను. ఫస్ట్​ ఓవర్‌లో ఎలా ఆడాలి..? ఐదో ఓవర్‌, పదో ఓవర్‌ సమయానికి గేమ్‌ను ఏ ప్లాన్​తో ముందుకు తీసుకెళ్లాలి? ఎంత స్కోరు చేస్తే పోరాడగలం? అనే అంశాలు అందులో ఉంటాయి. అందుకు తగ్గట్టుగా ఆడేందుకు మాత్రమే నేను ప్రయత్నిస్తాను" అని వ్యాఖ్యానించాడు.

Rohit Sharma Records List : రోహిత్ ఖాతాలో రెండు అరుదైన రికార్డులు.. ఆ ఘనత సాధించిన ఏడో కెప్టెన్​గా..

Rohit Sharma Paid Fine : 'అవన్నీ అబద్ధం.. రోహిత్​ కారు స్పీడ్​ అది కాదు.. ఫైన్​ కూడా..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.