ETV Bharat / sports

శతకంతో రోహిత్​ జోరు- టెస్టుల్లో​ అరుదైన ఘనత - రోహిత్ శర్మ

ఓపెనర్ రోహిత్​ శర్మ ఇంగ్లాండ్​లో జోరుమీదున్నాడు. శతకం బాది ఇంగ్లాండ్​ బౌలర్లకు చుక్కలు చూపించిన రోహిత్.. టెస్టుల్లో 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

Rohit Sharma
రోహిత్​ శర్మ
author img

By

Published : Sep 4, 2021, 8:11 PM IST

Updated : Sep 4, 2021, 10:45 PM IST

ఇంగ్లాండ్​లో అద్భుత ఫామ్​లో ఉన్న టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్​ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో సెంచరీ చేసిన హిట్​మ్యాన్​.. టెస్టు ఫార్మాట్​లో 3 వేల పరుగులు మార్క్​ను అందుకున్నాడు. విదేశాల్లో రోహిత్​కు ఇదే తొలి టెస్టు సెంచరీ.

74 ఇన్నింగ్స్​లలో రోహిత్ 3 వేల పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే అతడి కన్నా ముందున్నాడు. కోహ్లీ 73 ఇన్నింగ్స్​లలో ఈ ఘనత సాధించాడు.

ఓపెనర్​గానూ విజృంభణ..

ఓపెనర్​గా అన్ని ఫార్మాట్లలో కలిపి 11 వేల పరుగులను నమోదు చేశాడు రోహిత్. ఈ రికార్డు అందుకున్న రెండో బ్యాట్స్​మన్​గా​ నిలిచాడు. సచిన్​ తెందూల్కర్​ 241 ఇన్నింగ్స్​లలో ఈ మైలురాయిని చేరుకోగా.. రోహిత్​ శర్మ 246 ఇన్నింగ్స్​లలో ఈ ఘనత సాధించాడు.

ఇదీ చూడండి: IND Vs ENG: లంచ్​ విరామానికి టీమ్ఇండియా 108/1

Last Updated : Sep 4, 2021, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.