Rohit Sharma Icc Controversy: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెంట్గా సౌతాఫ్రికా పర్యటనలో కేప్‌టౌన్ మ్యాచ్ తర్వాత క్రికెట్ పిచ్‌లపై రోహిత్ బహిరంగంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆతిథ్య దేశాన్ని కాకుండా పిచ్‌ను చూసి రేటింగ్ ఇవ్వాలని అతడు పిచ్ రిఫరీలకు సూచించాడు. అయితే రోహిత్ వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి రోహిత్ చెప్పినట్లుగా రేటింగ్ విషయాన్ని ఐసీసీ పరిష్కరిస్తుందా? లేదా రోహిత్‌పై చర్యలు తీసుకుంటుందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
రోహిత్ ఏమన్నాడంటే? ఇటీవల కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికా- భారత్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. అయితే కేప్‌టౌన్ పిచ్ పూర్తిగా పేసర్లకు సహకరించింది. ఊహించిన దానికంటే బంతి ఎక్కువగా బౌన్స్ అవుతూ, బ్యాటర్లను భయపెడ్డింది. దీంతో ఈ మ్యాచ్‌లో పేసర్లు 33 వికెట్లు నేలకూల్చారు. ఫలితంగా మ్యాచ్ కేవలం ఒకటిన్నర రోజుల్లనే ముగిసింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ రోజుల్లో ముగిసిన మ్యాచ్ ఇదే కావడం విశేషం.
అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. 'ఈ టెస్టులో ఏం జరిగిందో, పిచ్ ఎలా ప్రవర్తించిందో అందరూ చూశారు. ఇండియాకు వెళ్లినప్పుడు అక్కడి పిచ్‌ల గురించి మాట్లాడే విషయంలో నోరు మూసుకుని ఉంటే, ఇలాంటి పిచ్‌పై ఆడేందుకు నిజంగానే నాకెలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పిచ్ చాలా ప్రమాదకరంగా ఉంది. మాకు పెద్ద సవాలు విసిరింది. భారత్ పిచ్‌లపై కూడా ఇలాంటి సవాలే ఉంటుంది. మేము టెస్టు క్రికెట్ ఆడేందుకు వచ్చాం. పిచ్ ఎలా ఉన్నా ఆడాల్సిందే. కానీ భారత్‌లో తొలి రోజు నుంచే స్పిన్ తిరిగితే అందరు ఏదేదో మాట్లాడతారు. మొదటి రోజు నుంచి బంతి సీమ్ అయితే పర్వాలేదు. కానీ బంతి తిరిగితే మాత్రం ఒప్పుకోరా? ఈ విషయంలో తటస్థంగా ఉండాలి. పిచ్‌లకు రేటింగ్ ఇచ్చేటప్పుడు రిఫరీలు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి' అని రోహిత్ శర్మ చెప్పాడు.
'విభిన్న పరిస్థితుల్లో ఆడడాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకోవాలి. విదేశీ జట్లు భారత్‌లో ఆడేటప్పుడు పిచ్‌ను విమర్శించకుండా, ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేయాలి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ప్లేయర్లు వాళ్ల దేశాల్లో కఠిన సవాళ్లు ఎదుర్కొంటూ, భారత్‌లోని టర్నింగ్ పిచ్‌లను విమర్శిస్తారు. అది మారాలి' అని రోహిత్ అన్నాడు.
-
What a start to the year 👌 pic.twitter.com/P21uVMhQDc
— Rohit Sharma (@ImRo45) January 7, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">What a start to the year 👌 pic.twitter.com/P21uVMhQDc
— Rohit Sharma (@ImRo45) January 7, 2024What a start to the year 👌 pic.twitter.com/P21uVMhQDc
— Rohit Sharma (@ImRo45) January 7, 2024
టీ20ల్లో రోహిత్, విరాట్ రీ ఎంట్రీ- అఫ్గాన్ సిరీస్‌కు జట్టు ప్రకటన
టీ20 వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ ఇన్, కోహ్లీ ఔట్- కెప్టెన్ ఛాన్స్ అతడికే!