ETV Bharat / sports

క్రికెట్​ కిట్‌ కొనేందుకు రోహిత్​ శర్మ పాల ప్యాకెట్లు వేశాడట - క్రికెట్​ కిట్‌ కొనేందుకు రోహిత్​ పాల ప్యాకెట్లు

సామాన్య కుటుంబం నుంచి వచ్చిన టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెటర్‌గా మారేందుకు తీవ్రంగా శ్రమించాడని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్ సభ్యుడు ప్రజ్ఞాన్‌ ఓజా అన్నాడు. గతంలో తాను, రోహిత్​ ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్నాడు. ఆ వివరాలు..

Mumbai indians Rohith
క్రికెట్​ కిట్‌ కొనేందుకు రోహిత్​ శర్మ పాల ప్యాకెట్లు వేసేవాడట
author img

By

Published : Mar 28, 2023, 9:39 PM IST

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్‌ మరో మూడు రోజుల్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్లేయర్స్​ అందరూ తమ క్యాంపులకు చేరుకుని ప్రాక్టీస్​ చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ లీగ్​లో ఆడే ముంబయి ఇండియన్స్​ టీమ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఐదు సార్లు ట్రోఫీని ముద్దాడిన ఈ టీమ్​.. ఈ సారి కూడా ఎలాగైనా కప్పు కొట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇక ఈ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ సారి కూడా తమ జట్టుకు ట్రోఫీని అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే హిట్​మ్యాన్ గురించి మాట్లాడాడు టీమ్​ఇండియా మాజీ ప్లేయప్​, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్ సభ్యుడు ప్రజ్ఞాన్‌ ఓజా. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రోహిత్ శర్మ.. టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఎదిగిన ప్రయాణంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగే తాను ఎదుర్కొన్న కష్టాలను గురించి తెలిపాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా మారేందుకు హిట్​మ్యాన్​ తీవ్రంగా శ్రమించాడని గుర్తుచేసుకున్నాడు. కొత్త కిట్‌ను కొనుగోలు చేసుకునేందుకు రోహిత్.. పాల ప్యాకెట్లను కూడా వేసినట్లు తెలిపాడు.

"నేను తొలిసారి అండర్-15 నేషనల్​ క్యాంప్‌లో రోహిత్‌ శర్మను కలిశాను. అతడో స్పెషల్​ ప్లేయర్‌ అని అందరూ నాతో చెప్పేవారు. అతడికి ప్రత్యర్థిగా ఆడి ఔట్ చేశాను. అయితే.. ఆడేటప్పుడు దూకుడుగా ఉండే రోహిత్‌ శర్మ పెద్దగా మాట్లాడేవాడు కాదు. నాతో ఆడేటప్పుడు మాత్రం చాలా దూకుడుగా వ్యవహరించేవాడు. ఎందుకు అలా ఉన్నాడో నాకైతే తెలియదు. ఆ తర్వాత కొన్నాళ్లకు మా మధ్య స్నేహం బలపడింది. అతడు మిడిల్ క్లాస్​ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఓ సారి మేము క్రికెట్‌ కిట్ బడ్జెట్‌ గురించి చర్చలు చేస్తుంటే ఒక్కసారిగా అతడు చాలా ఎమోషనల్​ అయిపోయాడు. దాని కోసం అతడు పాల ప్యాకెట్ల కూడా వేశాడు. ఇదంతా జరిగి చాలా కాలమైపోయింది. అసలు మా క్రికెట్‌ జర్నీ ఎలా మొదలైంది.. ఇప్పుడు హిట్​మ్యాన్​ ఎదిగిన తీరును చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తోంది" అని ఓజా పేర్కొన్నాడు.

కాగా, అండర్‌ - 15 క్రికెట్‌ స్థాయి నుంచి రోహిత్, ఓజా కలిసి ఆడారు. అలాగే వీరిద్దరు కలిసి భారత్‌ తరఫున 24 మ్యాచ్‌లు ఆడారు. ఇకపోతే ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్‌ టీమ్​కు ప్రాతినిథ్యం వహించిన వీరిద్దరూ ఆ తర్వాత ముంబయి ఇండియన్స్​ జట్టుకు షిఫ్ట్ అయిపోయారు. అయితే ఓజాకు 2015 సీజన్​లో చివరిగా ఆడాడు. హిట్​మ్యాన్​ ప్రస్తుతం ముంబయి ఇండియన్స్‌కు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు.

ఇదీ చూడండి: గాయంతో చేతికి కుట్లు.. అయినా సెంచరీతో రెచ్చిపోయిన కోహ్లీ.. ఇన్నింగ్స్​ గుర్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.