Rohit Sharma Confusion Playing 11: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్- అఫ్గానిస్థాన్ మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌కు మొహాలీ బింద్రా స్టేడియం వేదికైంది. టాస్ నెగ్గిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అఫ్గానిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే టాస్ తర్వాత కామెంటేటర్ మురళీ కార్తిక్- రోహిత్ మధ్య ఓ సరదా సన్నివేశం జరిగింది.
టాస్ పూర్తైన తర్వాత ప్లేయింగ్ 11 గురించి చెప్పే క్రమంలో రోహత్ కాస్త కన్ఫ్యూజన్కు గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో బెంచ్‌కు పరిమితమైన ప్లేయర్ల గురించి కామెంటేటర్ మురళీ కార్తిక్ అడిగాడు. దానికి రోహిత్ సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్, యశస్వి జైశ్వాల్ అని ముగ్గురి పేర్లు చెప్పి, నాలుగో ప్లేవర్ ఎవరా అని నవ్వుతూ ఆలోచిస్తూ 'నీకు అల్రెడీ చెప్పాను కదా' అని అన్నాడు. అయితే నాలుగో ప్లేయర్ కుల్దీప్ యాదవ్ అని మురళీ కార్తిక్ గుర్తు చేయాగా, లేదు అతడు ఆడుతున్నాడంటూ రోహిత్ కన్ఫ్యూజ్ అయ్యాడు. మళ్లీ వెంటనే 'హా కుల్దీప్ ఆడట్లేదు' అని స్పష్టం చేశాడు. రోహిత్ ఇలా కన్ఫ్యూజ్ అవ్వడం నవ్వులు పూయించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
Typical Rohit Sharma moment during the toss😂#RohitSharma𓃵 #INDvsAFG pic.twitter.com/ntWUjdWF4t
— Quantum⁴⁵ Yadav (@45Quantum) January 11, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Typical Rohit Sharma moment during the toss😂#RohitSharma𓃵 #INDvsAFG pic.twitter.com/ntWUjdWF4t
— Quantum⁴⁵ Yadav (@45Quantum) January 11, 2024Typical Rohit Sharma moment during the toss😂#RohitSharma𓃵 #INDvsAFG pic.twitter.com/ntWUjdWF4t
— Quantum⁴⁵ Yadav (@45Quantum) January 11, 2024
ఆ రికార్డుకు చేరువలో: టీమ్ఇండియాకు టీ20ల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచేందుకు రోహిత్ అతి దగ్గరలో ఉన్నాడు. ఈ లిస్ట్‌లో మాజీ క్రికెటర్ ఎమ్ఎస్ ధోనీ 41 విజయాలతో ముందు వరుసలో ఉన్నాడు. ధోనీ 2007 నుంచి 2016 దాకా టీమ్ఇండియాకు టీ20ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక ప్రస్తుత కెప్టెన్ రోహిత్ 39 విజయాలతో రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
టీమ్ఇండియాకు టీ20ల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్లు
- ధోనీ- 41 విజయాలు- 72 మ్యాచ్‌లు
- రోహిత్ శర్మ- 39* విజయాలు- 51 మ్యాచ్‌లు
- విరాట్ కోహ్లీ- 30 విజయాలు- 50 మ్యాచ్‌లు
ప్రస్తుతం అఫ్గాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను రోహిత్ సేన 3-0తో క్లీన్‌స్వీప్ చేస్తే, హిట్‌మ్యాన్ టాప్‌లోకి దూసుకెళ్తాడు. భారత్‌కు పొట్టి ఫార్మాట్లో అత్యధిక విజయాలు (42) అందించిన కెప్టెన్‌గా నిలుస్తాడు.
ఇండోపాక్ సిరీస్‌లకు PCB ఛైర్మన్ రిక్వెస్ట్- జై షా రిప్లై ఇదే!