Rohit Sharma Captain: టీమ్ఇండియా వన్డే జట్టు సారథి బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయంపై పలువురు సీనియర్ క్రికెటర్లు సహా చాలా మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై భారత జట్టు కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
"భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఇది ఎప్పుడూ ఉండేదే. దీనిపై కొందరు పాజిటివ్‌గా మరికొందరు నెగటివ్‌గా మాట్లాడుతూనే ఉంటారు. కానీ, ఓ క్రికెటర్‌గా ఇవన్నీ పట్టించుకోను. నా ఆటపైనే దృష్టి పెడతాను. ఇది నేను కెప్టెన్‌గా చెప్పట్లేదు ఓ ప్లేయర్‌గానే చెబుతున్నా."
--రోహిత్ శర్మ, టీమ్ఇండియా కెప్టెన్.
జట్టుకు కూడా ఇదే సందేశం ఇస్తున్నట్లు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఓ ముఖ్యమైన టోర్నీ జరుగుతున్నప్పుడు జట్టుపై చర్చలు బాగా జరుగుతాయని టీమ్ సభ్యులకు తెలుసని అన్నాడు. 'బయట మాట్లాడుకునే అంశాలపై కాకుండా ఆటపైనే దృష్టి పెట్టాలి. పూర్తి విశ్వాసంతో గెలిచేందుకే ఆడాలి.' అని రోహిత్ శర్మ సూచించాడు. టీమ్ఇండియా ప్రధాన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లలో బంధాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నాడు.
-
🗣️🗣️ "The pressure will always be there. As a cricketer, it is important to focus on my job."
— BCCI (@BCCI) December 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
SPECIAL - @ImRo45's first interview after being named #TeamIndia’s white-ball captain coming up on https://t.co/Z3MPyesSeZ. 📽️
Stay tuned for this feature ⌛ pic.twitter.com/CPB0ITOBrv
">🗣️🗣️ "The pressure will always be there. As a cricketer, it is important to focus on my job."
— BCCI (@BCCI) December 12, 2021
SPECIAL - @ImRo45's first interview after being named #TeamIndia’s white-ball captain coming up on https://t.co/Z3MPyesSeZ. 📽️
Stay tuned for this feature ⌛ pic.twitter.com/CPB0ITOBrv🗣️🗣️ "The pressure will always be there. As a cricketer, it is important to focus on my job."
— BCCI (@BCCI) December 12, 2021
SPECIAL - @ImRo45's first interview after being named #TeamIndia’s white-ball captain coming up on https://t.co/Z3MPyesSeZ. 📽️
Stay tuned for this feature ⌛ pic.twitter.com/CPB0ITOBrv
టీమ్ఇండియా టెస్టు జట్టుకు రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా ఎంపికచేసింది సెలెక్షన్ కమిటీ. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 18 మంది స్క్వాడ్‌ను ప్రకటించింది. డిసెంబర్ 26న దక్షిణాఫ్రికా భారత్ సిరీస్ ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: