Rohit Sharma BCCI : వరల్డ్ కప్ తర్వాత టీమ్ఇండియా ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌పై ఫోకస్ పెట్టింది. అలా వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉన్న భారత జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడుతోంది. ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్‌కు పయనమవ్వనుంది. అయితే ఇందుకు సంబంధించిన తుది జట్టును గురువారం ప్రకటించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆ జట్టులో యంగ్ ప్లేయర్స్‌తో పాటు రోహిత్ శర్మను ఆడించాలని భావిస్తోంది. కానీ ఈ విషయంపై రోహిత్ సుముఖత చూపించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ.. పట్టువదలకుండా రోహిత్‌ను ఈ జట్టులో చేర్చేందుకు బీసీసీఐ భారీ ప్లాన్స్ వేస్తోంది.
గతేడాది టీ20 ప్రపంచకప్ ఓటమి తర్వాత ఈ ఫార్మాట్లో రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఇటీవలే జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుంటున్న రోహిత్.. సౌతాఫ్రికాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్‌కు దూరంగా ఉండాలని అనుకున్నాడట. రోహిత్‌లాగా విరాట్ కూడా ఇదే డెసిషన్ తీసుకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రోహిత్ గైర్హాజరీలో టీ20లు, వన్డేల్లో టీమ్ఇండియాకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడు. కానీ గాయం కారణంగా హార్దిక్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు.
ఇక సౌతాఫ్రికా సిరీస్ సమయానికి పాండ్య పూర్తిగా ఫిట్నెస్ సాధించడం అనేది సాధ్యం కాదని విశ్లేషకుల అంచనా. మరోవైపు ఇప్పుడు జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీసులోనూ రోహిత్, పాండ్య ఆడటం లేదు. దీంతో జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌లోనూ సూర్యకుమార్ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సఫారీ గడ్డపై ఈ యంగ్ ప్లేయర్‌కు కెప్టెన్సీ విషయంలో సమస్యలు తలెత్తే సూచలను కనిపిస్తున్నాయి. దీంతో రోహిత్‌ను ఎలాగైనా ఒప్పించి, టీ20 సిరీస్‌లో జట్టు సారథ్య పగ్గాలు ఇవ్వాలని బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే కోహ్లి మాత్రం టీ20లతో పాటు వన్డేలకు కూడా దూరంగా ఉండాలనుకుంటున్నాడట. ఇప్పుటికీ ఈ విషయంపై బీసీసీఐకి కూడా అతను క్లారిటీ ఇచ్చాడట. దీంతో ఇప్పుడు బీసీసీఐ రోహిత్‌పైనే ఆశలు పెట్టుకుంది.
'విరాట్, రోహిత్ టీ20ల్లోనూ ఆడాలి - లేదంటే వారి ఫేర్వెల్ బాధ్యత హార్దిక్‌దే' : షోయబ్