Rohit Sharma 250th ODI Match : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆదివారం శ్రీలంక మ్యాచ్‌తో వన్డేల్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని కూడా హిట్‌మ్యాన్ అందుకున్నాడు. అంతే కాకుండా తాజా మ్యాచ్ (ఫైనల్)తో రోహిత్.. ఆసియా కప్ హిస్టరీలో ఐదు ఫైనల్స్ ఆడిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. అతడు ఇంతకుముందు 2008, 2010, 2016, 2018 టోర్నీల్లో ఫైనల్స్ ఆడాడు. ఇక తాజాగా మరో రెండు రికార్డులు సాధించాడు. మరి ఆ రికార్డులేంటంటే
ధోనీ కెప్టెన్సీ రికార్డు సమం..
ఆసియా కప్ టోర్నీల్లో ధోనీ.. 14 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియాకు సారథ్యం వహించాడు. ఇందులో భారత్.. 9 నెగ్గగా.. 4 ఓడింది. ఓ మ్యాచ్ డ్రా గా ముగిసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ.. ఆసియా కప్‌లో ఇప్పటికి 11 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో భారత్.. 9 గెలవగా.. ఒకదాంట్లో ఓడింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ విజయంలో రోహిత్.. 9 విజయాలతో ధోనీ రికార్డును సమం చేశాడు.
ధోనీ, అజారుద్దిన్‌తో ఈక్వెల్.. తాజా విజయంతో రోహిత్ సారధ్యంలో టీమ్ఇండియా రెండో (2018, 2023) ఆసియా కప్ టైటిల్ సాధించింది. ఈ క్రమంలో మహేంద్రసింగ్ ధోనీ, మహమ్మద్ అజారుద్దిన్ రికార్డును రోహిత్ సమం చేశాడు.
భారత్‌కు ఆసియా కప్ టైటిళ్లు సాధించిన కెప్టెన్లు..
- రోహిత్ శర్మ.. 2 (2018, 2023)
- ఎంఎస్ ధోనీ.. 2 (2010, 2016)
- అజారుద్దిన్.. 2 (1991, 1995)
- దిలిప్ వెంగ్‌సర్కార్ 1 (1988)
- సునీల్ గావస్కర్ 1 (1984).
-
India are the Champions of the Asia 🇮🇳
— Shubham 🇮🇳 (@DankShubhum) September 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Under GREATEST CAPTAIN ROHIT SHARMA#AsianCup2023#Siraj #INDvSL #IndiavsSrilanka #AsiaCupFinals #INDvsSL #AsianCup2023 pic.twitter.com/E5w8Ht5090
">India are the Champions of the Asia 🇮🇳
— Shubham 🇮🇳 (@DankShubhum) September 17, 2023
Under GREATEST CAPTAIN ROHIT SHARMA#AsianCup2023#Siraj #INDvSL #IndiavsSrilanka #AsiaCupFinals #INDvsSL #AsianCup2023 pic.twitter.com/E5w8Ht5090India are the Champions of the Asia 🇮🇳
— Shubham 🇮🇳 (@DankShubhum) September 17, 2023
Under GREATEST CAPTAIN ROHIT SHARMA#AsianCup2023#Siraj #INDvSL #IndiavsSrilanka #AsiaCupFinals #INDvsSL #AsianCup2023 pic.twitter.com/E5w8Ht5090
-
అంతేకాకుండా రోహిత్.. ఆసియా కప్ (వన్డే ఫార్మాట్)లో అత్యధిక పరుగులు (939) చేసిన భారత బ్యాటర్లలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్ట్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్.. 971 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.
అసియా కప్ (వన్డే ఫార్మాట్) టాప్ 5 భారత బ్యాటర్లు..
- సచిన్ తెందూల్కర్- 971 పరుగులు
- రోహిత్ శర్మ - 939 పరుగులు
- విరాట్ కోహ్లీ - 742 పరుగులు
- ధోనీ - 648 పరుగులు
- గౌతమ్ గంభీర్ - 573 పరుగులు..
IND Vs SL Asia Cup Finals : నిప్పులు చెరుగుతున్న బుమ్రా- సిరాజ్.. 12 పరుగులకే 6 వికెట్లు డౌన్!
IND Vs SL Asia Cup : విరాట్ టు చరిత్.. ఆసియా కప్ ఫైనల్స్‌లో ఈ స్టార్ ప్లేయర్లపైనే గురి!