ETV Bharat / sports

ప్రపంచ రికార్డు బ్రేక్.. చరిత్రలోనే అతిపెద్ద విజయం - ముంబయి

Ranji Trophy 2022: ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో చరిత్ర సృష్టించింది దేశవాళీ మేటి జట్టు ముంబయి. గురువారం ఉత్తరాఖండ్​తో జరిగిన క్వార్టర్​ ఫైనల్​ మ్యాచ్​లో ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది. అత్యధికంగా 725 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది.

World Record
Mumbai
author img

By

Published : Jun 9, 2022, 7:41 PM IST

Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది దేశవాళీ మేటి జట్టు ముంబయి. గురువారం ఉత్తరాఖండ్​తో జరిగిన క్వార్టర్​ఫైనల్లో 725 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన ఆ జట్టు.. ప్రపంచ రికార్డును సైతం బ్రేక్ చేసింది. 92 ఏళ్ల క్రితం షెఫీల్డ్​ షీల్డ్​ క్రికెట్​లో క్వీన్స్​లాండ్​పై 685 పరుగుల తేడాతో న్యూసౌత్​ వేల్స్ గెలుపొందింది. ఇప్పటివరకు ఉన్న ఆ రికార్డును ముంబయి బ్రేక్ చేసింది.

రంజీల్లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన రికార్డు ఇంతకుముందు బంగాల్​ పేరిట ఉండేది. 1953-54లో ఆ జట్టు ఒడిశాను 540 పరుగుల తేడాతో ఓడించింది. ఇక జార్ఖండ్​తో మరో క్వార్టర్స్​లో 129 ఏళ్ల రికార్డును బ్రేక్​ చేస్తూ 9 మంది బంగాల్​ బ్యాటర్లు 50+ సోర్లు సాధించిన తర్వాతి రోజే ముంబయి ఈ ఘనత సాధించింది. ఈ ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ సెమీస్​లో ఉత్తర్​ప్రదేశ్​ను ఢీకొనబోతోంది ముంబయి.

మ్యాచ్​ జరిగిందిలా: ఇప్పటివరకు 41సార్లు రంజీ ట్రోఫీ ఛాంపియన్​గా నిలిచిన ముంబయి.. క్వార్టర్స్​లో ఉత్తరాఖండ్​కు 794 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనలో ముంబయి బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్​లో 69 పరుగులకే కుప్పకూలింది ఉత్తరాఖండ్.

ఇదీ చూడండి: మళ్లీ హ్యాట్రిక్​ సెంచరీలతో 'బాబర్​'​ రికార్డ్​.. కోహ్లీని దాటి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.