శ్రీలంకపై రెండో వన్డేలో జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన టీమ్ఇండియా క్రికెటర్ దీపక్ చాహర్.. కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై సరదాగా స్పందించాడు. అతడు "ఇందిరానగర్‌కు మాత్రమే కాదు మొత్తం ఇండియాకే గూండా" అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. ఇటీవల ఓ వ్యాపార ప్రకటనలో భాగంగా 'ఇందిరా నగర్ గూండానురా' నేను అంటూ ద్రవిడ్ నటించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇండియా-ఏలో ఆడేటప్పుడు పలు పర్యటనలకు ద్రవిడ్‌తో కలిసి వెళ్లానని చాహర్ గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో తాను బ్యాటింగ్ చేయడం అతడు గుర్తించాడని చెప్పాడు. "ఇప్పుడు కూడా అలాంటి అవకాశమే వచ్చింది. దీంతో మ్యాచ్ గెలిపించాను. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో నన్ను భువీ తర్వాత పంపడం కలిసొచ్చింది. జట్టు పరిస్థితిని బట్టి ద్రవిడ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు" అని తెలిపాడు.
ఐపీఎల్లో చెన్నై జట్టులో సభ్యుడైన చాహర్.. తనపై మహీ ప్రభావం చాలా ఉందని పేర్కొన్నాడు. "నాపై ధోనీ ప్రభావం చాలా ఉంది. అతడు చెన్నై జట్టులోనే కాకుండా భారత జట్టులోనూ మ్యాచ్‌లను ఎంత ఉత్కంఠ పరిస్థితులకు తీసుకెళ్తాడో మనమంతా చూశాం. మ్యాచ్ జరిగేటప్పుడు ఎప్పుడు మాట్లాడినా ఆటను చివరి వరకూ తీసుకెళ్లే బాధ్యత నాపైనే ఉందని అంటాడు. అలా చేస్తేనే మ్యాచ్ ఉత్కంఠకు వెళ్తుందని అనేవాడు. దాంతో నేను కూడా రెండో వన్డేను అలాగే చివరివరకూ తీసుకెళ్లాలని అనుకున్నా. అదే నా ప్రణాళిక" అని చాహర్ వివరించాడు.
బ్యాటింగ్‌లో తండ్రి సాయం..
"బ్యాటింగ్ విషయంలో మా నాన్నే నాకు కోచ్. మేమిద్దరం మాట్లాడుకున్న ప్రతిసారి ఈ విషయం ప్రస్తావనకు వచ్చేది. అభిమానులు నన్ను ఆల్‌రౌండర్‌గా పరిగణిస్తారా లేదా అన్నది నేను పట్టించుకోను" అని దీపక్ చాహర్ పేర్కొన్నాడు.
శ్రీలంకపై రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగుల స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. 193 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. దీంతో క్రీజులోకి వచ్చిన పేసర్ దీపక్(69 నాటౌట్).. సందర్భానుసారంగా ఆడాడు. నిర్ణయాత్మక మ్యాచ్‌లో కీలకంగా వ్యవహరించి జట్టుకు విజయంతో పాటు సిరీస్‌ను అందించాడు.
ఇదీ చదవండి: కరోనా కలకలం- టాస్ వేశాక వన్డే మ్యాచ్ వాయిదా