భారత్- పాక్ మ్యాచ్(ind pak t20) అనగానే క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఉత్సాహం వస్తుంది. మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కాగా, భారత్-పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడం వల్ల కొనేళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. అక్టోబర్ 17 నుంచి యూఏఈ వేదికగా టీ 20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈ నెల 24న భారత్-పాక్ జట్లు ఎదురుపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్‌పై పాక్(ind pak t20) విజయం సాధిస్తే పాకిస్థాన్ ఆటగాళ్లకు బ్లాంక్ చెక్కు ఇస్తామని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా(pcb chairman ramiz raja) సంచలన ప్రకటన చేశారు. బ్లాంక్ చెక్ ఇవ్వడానికి ఓ బలమైన ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఇంటర్ ప్రావిన్షియల్ కో-ఆర్డినేషన్‌పై వేసిన సెనేట్ స్టాండింగ్ కమిటీ ముందు రమీజ్ రాజా ఈ వ్యాఖ్యలు చేశాడు.
"పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి 50శాతం నిధులు వస్తాయి. ఐసీసీకి సుమారు 90 శాతం నిధులు ఒక్క భారత్ నుంచే వస్తుంటాయి. ఒకరకంగా చెప్పాలంటే భారత్‌లోని వ్యాపార సంస్థలే పాకిస్థాన్ క్రికెట్‌ను నడిపిస్తున్నాయి. ఐసీసీకి బీసీసీఐ నుంచి నిధులు సమకూరకుంటే పాక్ క్రికెట్ బోర్డు కుప్పకూలుతుంది."
రమీజ్ రాజా, పీసీబీ ఛైర్మన్
ఇటీవల ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తమ దేశ పర్యటనను రద్దు చేసుకోవడం వల్ల రమీజ్ రాజా(pcb chairman ramiz raja) ఆగ్రహంతో ఉన్నాడు. పాక్ క్రికెట్ బోర్డు(pcb news).. బీసీసీఐలా ఆర్థికంగా బలంగా ఉంటే.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఇంతటి సాహసం చేసి ఉండేవి కాదని స్పష్టం చేశారు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు భారత్‌తో పాటు న్యూజిలాండ్‌ని ఓడించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అయితే, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్-పాక్ ఆరు సార్లు తలపడగా 5 సార్లు టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది.