ETV Bharat / sports

రాబిన్​సన్​పై నెటిజన్లు ఫైర్.. యాషెస్​లోనూ 'విరాట్​ పంచ్' కోరుతున్న ఫ్యాన్స్! - విరాట్ వర్సెెస్ రాబిన్‌సన్‌

Ollie Robinson Sledging : క్రికెట్​ ఆటలో స్లెడ్జింగ్ అనేది మైదానంలో హీట్​ను పెంచుతుంది. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ 2023లో ఓ ఇంగ్లాండ్ ఆటగాడు స్లెడ్జింగ్ చేయడం వల్ల ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే అదే ఆటగాడు రెండేళ్ల కిందట భారత్​తో జరిగిన మ్యాచ్​లో స్లెడ్జింగ్​కు పాల్పడ్డాడు. అప్పుడు కోహ్లీ అతడికి గట్టిగా బదులిచ్చాడు. ఈ నేపథ్యంలో ఆ బౌలర్​కు ఆసిస్ ఆటగాళ్లు సైతం విరాట్​లా బుద్ధి చెప్పాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇంతకీ ఈ కథేంటంటే..

Ollie Robinson Sledging
ఓలీ రాబిన్‌సన్‌ స్లెడ్జింగ్
author img

By

Published : Jun 24, 2023, 6:51 PM IST

Ollie Robinson Sledging : క్రికెట్​లో సాధారణంగా విదేశీ ఆటగాళ్లు ఎక్కువగా ప్రత్యర్థుల పట్ల స్లెడ్జింగ్​కు పాల్పడుతుంటారు. ఈ క్రమంలోనే యాషెస్ 2023 తొలి మ్యాచ్​లో ఆఖరి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాను ఉద్దేశించి ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ పేసర్ ఓలీ రాబిన్‌సన్‌ స్లెడ్జ్‌ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ సహా ఇతర ఆటగాళ్లపైనా రాబిన్‌సన్.. వ్యాఖ్యలు హాట్ టాపిక్​గా మారాయి. దీంతో అతడు వివాదాల్లోకెక్కాడు.

ఆట సాగుతుండగా ప్రత్యర్థులపై స్లెడ్జింగ్ చేయడం రాబిన్‌సన్​కు కొత్తేమీ కాదు. గతంలో ఈ తరహాలోనే రాబిన్‌సన్ స్లెడ్జింగ్​కు పాల్పడ్డాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ - రాబిన్‌సన్ మధ్య గతంలో మాటల యుద్ధం నడిచింది. ఆ సంఘటన ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే టీమ్ఇండియాలో స్లెడ్జింగ్​కు పాల్పడే ప్లేయర్ల సంఖ్య చాలా తక్కువ. కానీ జట్టులో ఏ ప్లేయర్​పై అయినా ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జ్‌ చేస్తే.. కింగ్ కోహ్లీ బ్యాటుతో పాటు మాటలతోనూ జవాబిస్తాడు. గత కొన్నేళ్లుగా విరాట్ ఇలాంటి ఘటనలు చాలా ఎదుర్కొన్నాడు.

తనపై స్లెడ్జ్‌ చేసిన ఆటగాడిని విరాట్.. గుర్తుపెట్టుకుని మరీ నిద్రలేని రాత్రిని మిగిలుస్తాడు. తనదైన రోజున అంత పరాక్రమవంతంగా.. స్లెడ్జ్‌ చేసిన బౌలర్​పై ఏ మాత్రం జాలి చూపకుండా చీల్చి చెండాడతాడు. అయితే అదే పద్ధతిలో ప్రస్తుత యాషెస్‌లో ఓలీ రాబిన్‌సన్‌కు తమ ఆటగాళ్లు.. విరాట్ లాంటి ట్రీట్‌మెంట్‌ను.. ఇవ్వాలని ఆస్ట్రేలియా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఆ మ్యాచ్​లో ఏం జరిగిందంటే?
Virat Kohli vs Robinson Test Match : రెండేళ్ల కిందట 2021లో భారత్ విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడింది. అయితే అప్పుడు విరాట్ క్రీజులో ఉండగా.. రాబిన్‌సన్‌ కోహ్లీతో సహా టీమ్ఇండియా ప్లేయర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంతే మైదానంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్​లో రాబిన్‌సన్‌ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు విరాట్ కామెంట్ల రూపంలో ర్యాగింగ్ చేశాడు. అంతకుముందు ఇన్నింగ్స్​లో డకౌట్​గా వెనుదిరిగిన రాబిన్​ను టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టాడు.

"కమాన్ రాబిన్.. ఈ ఇన్నింగ్స్​లోనైనా పరుగులు చేస్తావా? నీ ఆట చాలా బోర్​ కొడుతోంది! ఇలా అయితే టెస్టుల్లో రాణించేది ఎలా" అని రాబిన్‌సన్‌ను టీజ్ చేశాడు విరాట్. కాగా ఆ సిరీస్​లో ఐదు చెస్టు మ్యాచ్​లకు గాను భారత్ రెండింట్లో గెలిస్తే.. ఇంగ్లాండ్ ఒక దాంట్లో నెగ్గింది. ఓ టెస్ట్ డ్రా కాగా.. చివరి టెస్టు మ్యాచ్ కరోనా కారణంగా రద్దైంది. రద్దైన టెస్టును 2022 జులైలో నిర్వహించారు. అందులో ఇంగ్లాండ్ భారీ విజయం సాధించింది. దీంతో సిరీస్ డ్రాగా ముగిసినట్లైంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.