ETV Bharat / sports

ODI World Cup 2023 : ఇంగ్లాండ్​ - న్యూజిలాండ్ మ్యాచ్​... 4658 వన్డేల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి! - New Zealand Vs England World Cup 2023 records

ODI World Cup 2023 Newzealand vs England Records : వన్డే ప్రపంచకప్‌ (ODI WC 2023) ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్​ను చిత్తు చేసి ఓడించింది న్యూజిలాండ్. ఈ ఆరంభ మ్యాచ్‌లో పరుగుల వరద పారడం సహా పలు ప్రపంచ రికార్డులు కూడా నమోదు అయ్యాయి. ఆ వివరాలు..

ODI World Cup 2023 : ఇంగ్లాండ్​ - న్యూజిలాండ్ మ్యాచ్​... 4658 వన్డేల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 10:10 PM IST

ODI World Cup 2023 Newzealand vs England Records : 2023 వన్డే ప్రపంచకప్​నకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఆరంభ మ్యాచ్‌లో పరుగుల వరద పారడం సహా పలు ప్రపంచ రికార్డులు కూడా నమోదు అయ్యాయి. గత ప్రపంచ కప్​(2019) ఫైనల్లో ఇంగ్లాండ్​ చేతిలో ఎదురైన ఓటమికి న్యూజిలాండ్‌ తాజాగా ప్రతీకారం​ తీర్చుకుంది. తాజాగా అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు.. ఇంగ్లాండ్​ను 9 వికెట్ల భారీ తేడాతో ఓడించి ఈ టోర్నీలో బోణీ కొట్టింది.

  • నమోదైన రికార్డులివే..(Newzealand vs England Records)
  • ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్​ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.2 ఓవర్లలో ఛేదించింది న్యూజిలాండ్‌. దీంతో ప్రపంచ కప్​ చరిత్రలో అత్యంత వేగంగా 280 లేదా అంతకన్నా ఎక్కువ స్కోరును ఛేదించిన జట్టుగా రికార్డు కెక్కింది.
  • ఈ మ్యాచ్​లో బెయిర్‌ స్టో ఇంగ్లాండ్​ పరుగుల ఖాతాను సిక్సర్‌తో తెరవడం ఆల్‌టైమ్‌ ప్రపంచ కప్‌ రికార్డ్. వరల్డ్​ కప్​ హిస్టరీలో తొలి పరుగులు సిక్సర్‌ రూపంలో రావడం ఇదే మొదటి సారి.
  • ప్రపంచకప్​లో న్యూజిలాండ్‌ తరఫున ఏ వికెట్‌ కైనా అత్యుత్తమ భాగస్వామ్యం.. డెవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర నమోదు చేసిన అజేయ 273 పరుగులు.
  • ప్రపంచకప్​ అరంగేట్రంలోనే శతకం బాదిన మూడో అతి పిన్న వయస్కుడిగా 23 ఏళ్ల, 321 రోజులు రచిన్‌ రవీంద్ర రికార్డ్​ కెక్కాడు. వరల్డ్‌కప్‌ అరంగేట్రంలో సెంచరీ చేసిన రెండో అతి పెద్ద వయస్కుడిగా (32 ఏళ్ల 89 రోజులు) కాన్వే రికార్డుల్లోకెక్కాడు.
  • డెవాన్‌ కాన్వే న్యూజిలాండ్‌ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 22 ఇన్నింగ్స్​లో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.
  • ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్‌లో 11 మంది ప్లేయర్లు రెండంకెల స్కోర్‌ చేయడం విశేషం. 4658 వన్డేల చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటి సారి. ఇది వరల్డ్​ రికార్డు.

కాగా, ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్​ నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 36.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ కోల్పోయి విజయం సాధించింది.

ODI World Cup 2023 : న్యూజిలాండ్ జట్టులో రప్ఫాడిస్తున్న మనోడు.. ఎవరీ​ 23 ఏళ్ల రచిన్ రవీంద్ర?.. అనంతపురంతో లింక్!

Indian Origin Cricketers In World Cup 2023 : వాళ్లూ మనోళ్లే.. ప్రత్యర్థి జట్ల తరఫున ఆడే భారత ప్లేయర్స్​ వీరే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.