ODI World Cup 2023 IND VS PAK : వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌పై విజయం సాధించడంపై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తమ గెలుపునకు బౌలర్లే కారణమని రోహిత్ ప్రశంసించాడు. "ఈ మ్యాచ్‌లోనూ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఇది 190 పరుగులు చేసే పిచ్ అని అనుకోలేదు. ఒక దశలో వారు 280 పరుగులు చేస్తారని అనుకున్నాను. పాకిస్థాన్ తమ ఇన్నింగ్స్‌ను అలానే ఆరంభించింది. మిడిలార్డర్‌లో బాబర్, రిజ్వాన్ తమ మార్క్ ఇన్నింగ్స్‌ను చూపించారు. అయితే సరైన సమయంలో మా బౌలర్లు బంతితో అద్భుతం చేశారు. నేను ఏ బౌలర్‌ను రంగంలోకి దింపుతుంటే.. వారు వికెట్లు తీయడం సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా వద్ద 6 బౌలింగ్ ఛాయిస్‌లు ఉన్నాయి. అయితే పరిస్థితికి తగ్గట్టు బౌలర్లను వినియోగించుకోవడం నా బాధ్యత. ప్రత్యర్ది జట్టు బ్యాటర్ల ఆధారంగా బౌలర్లను మార్చుతూ ఆడాను. రిజల్ట్ కూడా అందుకు తగ్గట్టుగానే వచ్చింది.
బ్యాటింగ్‌లో మా వాళ్లు అద్బుతంగా రాణించారు. ప్రపంచకప్‌నకు వచ్చే ముందు ప్రతీ ఒక్కరూ సూపర్ ఫామ్‌లోనే ఉన్నారు. మేము పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగాం. బ్యాటింగ్ ఆర్డర్స్‌పై కూడా స్పష్టత ఉంది. తక్కువ స్కోర్ మ్యాచ్ అయినా, హైస్కోరింగ్ మ్యాచైనా.. బ్యాటింగ్ అర్డర్‌లో నో ఛేంజ్. మా జట్టు సమతుల్యంగా ఉంది.
వరుసగా విజయాలను అందుకున్నప్పటికీ.. ప్రతీ మ్యాచ్ నుంచి చాలా విషయాలను నేర్చుకుంటున్నాను. ప్రతీ మ్యాచ్‌లో 100 శాతం ఉత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తాము. ఈ మెగా టోర్నీలో ఏ జట్టునూ తేలికగా తీసుకోలేం. మా జట్టు తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తుందని ఆశిస్తున్నాను" అని రోహిత్ అన్నాడు.
బాబర్ అజామ్ మాట్లాడుతూ.. "మాకు మంచి శుభారంభమే దక్కింది. నేను, ఇమామ్ కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. నేనూ, రిజ్వాన్ సాధారణంగానే ఆడాలనుకున్నాం. కానీ అకస్మాత్తుగా మా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఇన్నింగ్స్ ముగించలేకపోయాం. మేము ఇన్నింగ్స్ మొదలెట్టిన తీరుకు కనీసం 280- 290 పరుగులు స్కోరు చేస్తామని భావించాను. కొత్త బంతితో మా బౌలర్లు స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు" అని పేర్కొన్నాడు.
-
M. O. O. D! ☺️ 🇮🇳
— BCCI (@BCCI) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/18bdPJKDnh
">M. O. O. D! ☺️ 🇮🇳
— BCCI (@BCCI) October 14, 2023
Scorecard ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/18bdPJKDnhM. O. O. D! ☺️ 🇮🇳
— BCCI (@BCCI) October 14, 2023
Scorecard ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/18bdPJKDnh