ODI World Cup 2023 Hyderabad Schedule : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ - నెదర్లాండ్స్ మ్యాచ్ అక్టోబర్ 9న జరగనుండగా.. పాకిస్థాన్ - శ్రీలంక మ్యాచ్ ఆ మరుసటి రోజునే (అక్టోబర్ 10న) ఉంది. అయితే ఈ మ్యాచ్‌లకు సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి అంటూ హైదరాబాద్ పోలీసుల ఆందోళ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం కూడా బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. అయితే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాత్రం షెడ్యూలింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండవంటూ స్పష్టం చేశారు.
గత జూన్‌లోనే తొలి షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ, ఐసీసీ, ఆ తర్వాత వివిధ దేశాలు, రాష్ట్ర క్రికెట్ సంఘాల విజ్ఞప్తుల మేరకు తొమ్మిది మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేస్తూ ఐసీసీ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి హెచ్‌సీఏ విజ్ఞప్తి చేసినా రీషెడ్యూల్‌కు అవకాశం ఉండటం కష్టమేనంటూ రాజీవ్ శుక్లా వ్యాఖ్యలను బట్టి తేలిపోయింది.
Pakistan Matches In World Cup 2023 : మరోవైపు పాకిస్థాన్ మ్యాచ్ కావడం వల్ల భద్రతను మరింత కట్టుదిట్టంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీస్, క్రికెట్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే షెడ్యూల్ ప్రకారం ఉప్పల్ వేదికగానే పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో, అక్టోబర్ 10న శ్రీలంకతో తలపడనుంది. అలాగే రెండు వార్మప్ మ్యాచ్‌లను కూడా ఉప్పల్‌లోనే పాక్ ఆడనుంది.
ఇప్పటికే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌ల టికెట్ల విక్రయాలకు సంబంధించి సర్వం సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా.. ఆగస్ట్ 25 నుంచి అధికారికంగా విక్రయాలు జరగనున్నాయి. ఇక భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీకి దేశవ్యాప్తంగా పది వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం కూడా ఒకటి కావడం విశేషం. అయితే ఉప్పల్ స్టేడియంలో భారత్ ఆడే మ్యాచ్‌లు లేవు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ODI World Cup : మరో 50రోజుల్లో వన్డే సమరం.. జట్టులో హైదరాబాదీకి ప్లేస్ డౌటే!
Rohit Sharma World Cup 2023 : 'అందరూ మా గురించే మాట్లాడుతున్నారు. అతన్ని అడగరేం'