Mushfiqur Rahim Wicket : బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్, విచిత్రమైన రీతిలో ఔటయ్యాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భాగంగా తొలి రోజు బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు దిగింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్ కైల్ జెమిసన్ 41వ ఓవర్ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ మూడో బంతిని క్రీజులో ఉన్న ముష్ఫికర్, డిఫెన్స్ ఆడాడు.
అయితే బ్యాట్‌ను తాకిన బంతి, స్టంప్స్ మీదకు వెళ్తుందేమోనని ముష్ఫికర్ తన చేయి అడ్డుపెట్టి బంతిని ఆపాడు. దీంతో కివీస్ ప్లేయర్లంతా ముష్ఫికర్‌ను ఔట్ ఇవ్వాల్సిందిగా అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్లు రాడ్ టకర్, పాల్ రేఫిల్ థర్డ్ ఎంపైర్‌కు రిఫర్ చేశారు. రిప్లై పరిశీలించిన థర్డ్ అంపైర్, ముష్ఫికర్‌ను ఔట్ (OBS)గా ప్రకటించాడు. అయితే ఎమ్‌సీసీ రూల్స్ 37.1 నిబంధన ప్రకారం క్రీజులో ఉన్న బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా బంతిని బ్యాట్‌తో కాకుండా, చేయి, కాలు అడ్డుపెట్టి ఆపితే ఆ ప్లేయర్‌ను ఔట్‌గా ప్రకటిస్తారు.
-
Did Mushfiqur Rahim really need to do that? He's been given out for obstructing the field! This one will be talked about for a while...
— FanCode (@FanCode) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
.
.#BANvNZ pic.twitter.com/SC7IepKRTh
">Did Mushfiqur Rahim really need to do that? He's been given out for obstructing the field! This one will be talked about for a while...
— FanCode (@FanCode) December 6, 2023
.
.#BANvNZ pic.twitter.com/SC7IepKRThDid Mushfiqur Rahim really need to do that? He's been given out for obstructing the field! This one will be talked about for a while...
— FanCode (@FanCode) December 6, 2023
.
.#BANvNZ pic.twitter.com/SC7IepKRTh
దీంతో ముష్ఫికర్ క్రీజును వదిలి వెళ్లక తప్పలేదు. అయితే ఇలా బంతిని చేయితో ఆపి ఔట్‌గా వెనుదిరిగిన తొలి బంగ్లా బ్యాటర్‌గా నిలిచాడు ముష్ఫికర్. ఇంతకు ముందు అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్థాన్ ప్లేయర్ ఇంజామమ్ ఉల్ హక్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇలా ఔటయ్యారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 66.2 ఓవర్లు ఆడిన బంగ్లా 172 పరుగులకు ఆలౌటైంది. వివాదస్పద రీతిలో ఔటైన ముష్ఫికర్ రీహీమ్ (35 పరుగులు) టాప్ స్కోరర్. షహదత్ హొసెన్ (31 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. ఇక మిగిలిన బ్యాటర్లెవరూ అంతకా ఆకట్టుకోలేదు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 3, గ్లెన్ ఫిలిప్స్ 3, అజాజ్ పటేల్ 2, టిమ్ సౌథీ 1 వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్, తొలి రోజు ఆట ముగిసేసరికి 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కాగా, తొలి టెస్టులో బంగ్లాదేశ్ 150 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
డీఎల్ఎస్లో పొరపాటు.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ తికమక!
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్- న్యూజిలాండ్‌పై 150 పరుగుల తేడాతో ఘన విజయం