శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ కోసం టీమ్‌ఇండియా ధర్మశాలకు చేరుకుంది. లఖ్‌నవూ మైదానం నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఆటగాళ్లను బీసీసీఐ బస్సులో తరలించింది. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ధర్మశాలకు చేర్చింది. ఈ సందర్భంగా బస్సులో భారత క్రీడాకారులు ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇందులో టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, ఓపెనర్ ఇషాన్ కిషన్, స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ పలు బాలీవుడ్ పాటలు పాడారు.
-
Match Day 🙌
— BCCI (@BCCI) February 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Onto the 2nd @Paytm #INDvSL T20I at Dharamsala 📍#TeamIndia pic.twitter.com/iAGh8FDrwt
">Match Day 🙌
— BCCI (@BCCI) February 26, 2022
Onto the 2nd @Paytm #INDvSL T20I at Dharamsala 📍#TeamIndia pic.twitter.com/iAGh8FDrwtMatch Day 🙌
— BCCI (@BCCI) February 26, 2022
Onto the 2nd @Paytm #INDvSL T20I at Dharamsala 📍#TeamIndia pic.twitter.com/iAGh8FDrwt
ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్‌ఇండియా మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను పట్టేయాలని రోహిత్‌సేన భావిస్తోంది. మరోవైపు సిరీస్ బరిలో నిలబడాలంటే శ్రీలంక తప్పకుండా గెలుపొందాలి. మొదటి మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో విఫలం కావడం వల్ల లంక పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లోనైనా పుంజుకొని విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.
ఇవీ చదవండి: