ETV Bharat / sports

వన్డేలకు మొయిన్​ అలీ రిటైర్మెంట్​..! హింట్​ ఇచ్చిన ఇంగ్లాండ్ స్టార్​ ఆల్​రౌండర్​

అక్టోబరు-నవంబర్‌లో భారత్‌ ఆతిథ్యమిస్తున్న 2023 వన్డే ప్రపంచకప్‌ తర్వాత వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్టు ఇంగ్లాండ్​ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ పరోక్షంగా తెలిపాడు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి నిర్ణయాలను తీసుకునే ఆలోచనలో లేనని తెలిపాడు.

author img

By

Published : Mar 14, 2023, 6:42 PM IST

england cricketer moeen ali retirement
england cricketer moeen ali retirement

ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ తన వన్డే కెరీర్​కు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో 100కి పైగా మ్యాచులు ఆడిన ఈ స్టార్​ ప్లేయర్​.. త్వరలో జరగనున్న ప్రపంచకప్ 2023 తన చివరి గేమ్​ కావచ్చంటూ పరోక్షంగా తెలిపాడు. దీంతో అలీ ఫ్యాన్స్ తీవ్ర​ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్న అలీ.. ఈ ఏడాది జూన్‌లో 36వ ఏట అడుగుపెట్టనున్నాడు. అయితే తాను ప్రస్తుతం ఎలాంటి నిర్ణయాలను తీసుకునే ఆలోచనలో లేనని తెలిపిన అలీ.. తనకు అనిపించినప్పుడు కచ్చితంగా పక్కకు తప్పుకుంటానని పేర్కొన్నాడు.

"నేను వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతానా లేదా అనేది స్పష్టం చేయడం లేదు. నాకు ఇప్పటికే 35 ఏళ్లు. త్వరలోనే 36లోకి అడుగుపెడతాను. ఇది నా క్రికెట్ కెరీర్​కు ముగింపు గురించి ఆలోచించాల్సిన సమయం. కాబట్టి లియామ్ లివింగ్‌స్టోన్, విల్ జాక్స్ వంటి యువ ఆటగాళ్లకు జట్టులో స్థానం కల్పించాలి. వారు తదుపరి ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు సిద్ధంగా ఉండాలి" అని మొయిన్​ అలీ స్థానిక మీడియాతో అన్నాడు.

ఇక ప్రస్తుతం ఇంగ్లండ్‌కు ఆడుతున్న యంగ్​ ప్లేయర్స్​ గురించి స్పందించిన మొయిన్​.. వారి పాత్రను చక్కగా పోషిస్తున్నారని కొనియాడాడు. తమ జట్టు ఛాంపియన్‌గా అవతరించేందుకు వీరు చాలా ముఖ్యమని కూడా పేర్కొన్నాడు. "నేను ఏం నిర్ణయించుకోలేదు. కానీ నేను ఏం చేయాలనుకుంటున్నాను అనే దాని గురించి నాకు కొంచెం స్పష్టత ఉంది. యంగ్​ క్రికెటర్లను చూసినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది" అని చెప్పాడు. మొయిన్ అలీ గత కొన్నేళ్లుగా ఇంగ్లాండ్ జట్టుకు మూలస్తంభంగా ఉన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌లో విజేత జట్టులో భాగమైన అలీ.. ఇప్పుడు తన జాతీయ జట్టు కోసం వరుసగా రెండోసారి ప్రపంచకప్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఇక మ్యాచ్​ విషయానికి వస్తే.. సౌతాఫ్రికా ఇంగ్లాండ్​ నడుమ వన్డే సిరీస్ రసవత్తరంగా సాగింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌ ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో తొలి రెండు మ్యాచ్‌లలో గెలుపొందిన ఆతిథ్య జట్టు.. సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే ఇటీవలే జరిగిన మూడో వన్డేలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మైదానంలో దిగిన ఇంగ్లండ్‌ స్టార్​ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ ఒంటిచేత్తో షాట్‌ కొట్టేందుకు యత్నించి విఫలమయ్యాడు. స్విచ్‌ హిట్‌ ఆడాలని ప్రయత్నించిన ఈ లెఫ్టాండర్​ అనూహ్యంగా ఔటయ్యాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.