ETV Bharat / sports

టీ20 సమరానికి టీమ్​ఇండియా రెడీ.. విండీస్​ అదరగొట్టేనా? - టీమ్​ఇండియా వెస్టిండీస్​ తొలి టీ20 అప్డేట్​

Teamindia Vs Westindies First T20: ప్రమాదకర ఆటగాళ్లతో నిండిన వెస్టిండీస్‌ను దాని సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో మట్టికరిపించిన ఉత్సాహంతో ఉంది టీమ్‌ఇండియా. తొలి రెండు వన్డేలతో పోలిస్తే మూడో మ్యాచ్‌లో సులువుగా, ఘనంగా గెలిచిన భారత్‌.. ఇప్పుడిక టీ20 పోరుకు సిద్ధమైంది. ఫార్మాట్‌ మార్పుతో పాటే జట్టు మారుతోంది. కెప్టెన్‌ మారుతున్నాడు. అటు ప్రత్యర్థి జట్టులోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే టీ20ల్లో కరీబియన్‌ జట్టును అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కచ్చితంగా సిరీస్‌ హోరాహోరీగానే సాగే అవకాశముంది. ఓ సారి జట్టు బలాబలాలపై లుక్కేద్దాం...

టీ20 సమరానికి టీమ్​ఇండియా రెడీ
Teamindia Vs Westindies First T20
author img

By

Published : Jul 29, 2022, 6:51 AM IST

Teamindia Vs Westindies First T20: శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలో వన్డే సిరీస్‌లో విండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలో కరీబియన్‌ జట్టును 5 టీ20ల సిరీస్‌లో ఢీకొనబోతోంది. చివరి వన్డే ఆడాక ఒక్క రోజు మాత్రమే విరామం తీసుకుని, శుక్రవారం తొలి టీ20 ఆడబోతోంది టీమ్‌ఇండియా. వన్డే సిరీస్‌లో తుది జట్టులో ఆడిన వాళ్లలో సూర్యకుమార్, దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్, అవేష్‌ ఖాన్, అక్షర్‌ పటేల్‌ మాత్రమే టీ20 సిరీస్‌లో కొనసాగనున్నారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ అయ్యాక విండీస్‌తో వన్డేలకు దూరంగా ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. తిరిగి ఈ సిరీస్‌లో జట్టు పగ్గాలు అందుకుంటున్నాడు. ఐపీఎల్‌ తర్వాత గాయంతో జట్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ ఈ సిరీస్‌లో ఆడేది అనుమానమే.

అశ్విన్‌ ఆడతాడా?: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసిన పంత్‌ను ఈ సిరీస్‌లోనూ అదే స్థానంలో కొనసాగించే అవకాశముంది. సూర్యకుమార్, శ్రేయస్‌ అయ్యర్, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌ తర్వాతి స్థానాల్లో ఆడొచ్చు. ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్న జడేజా మ్యాచ్‌ ఆడడం అనుమానమే. టీ20 ప్రపంచకప్‌ ప్రణాళికల్లో అశ్విన్‌ ఉంటే.. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడు. హార్దిక్‌తో పూర్తి కోటా వేయించేట్లయితే.. ఒక బౌలర్‌ను తగ్గించుకుని దీపక్‌ హుడాను తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. లేదంటే కుల్‌దీప్‌ యాదవ్‌కు రెండో స్పిన్నర్‌గా అవకాశం అందుతుంది. భువనేశ్వర్, హర్షల్‌ పటేల్‌లకు తోడుగా అవేష్‌ ఖాన్‌ లేదా అర్ష్‌దీప్‌ల్లో ఒకరిని ఎంచుకోవచ్చు.

జరభద్రం: ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్‌లో అదరగొట్టే విండీస్‌ వీరులు చాలామంది అంతర్జాతీయ జట్టుకు ఆడుతున్నారు. కెప్టెన్‌ పూరన్, ఆల్‌రౌండర్‌ హోల్డర్, పేసర్‌ అల్జారి జోసెఫ్‌లతో పాటు విధ్వంసక రోమన్‌ పావెల్‌తో భారత్‌కు ముప్పు తప్పదు. పూరన్, పావెల్‌ ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేయగలరు. హోల్డర్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభ గురించి తెలిసిందే. వీరు కాక ఆల్‌రౌండర్‌ కైల్‌ మేయర్స్, ఓపెనర్‌ కింగ్, స్పిన్నర్‌ అకీల్‌ హొసీన్‌లతోనూ భారత్‌ జాగ్రత్తగా ఉండాల్సిందే. వెస్టిండీస్‌ జట్టులో ఎక్కువ హిట్టర్లే కాబట్టి వారిని భారత బౌలర్లు ఎలా కట్టడి చేస్తారో చూడాలి. బ్యాట్స్‌మెన్‌.. హోల్డర్, జోసెఫ్, అకీల్‌ హొసీన్‌లతో జాగ్రత్తగా ఉండాల్సిందే.

ఇదీ చూడండి: తారుమారైన డబ్ల్యూటీసీ ర్యాంకులు.. వన్డేల్లో భారత్​ మూడో స్థానం సుస్థిరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.