ETV Bharat / sports

టాప్​ 10లో భారత్​ నుంచి స్మృతి మంధాన మాత్రమే! - టీమ్​ఇండియా

మహిళల వన్డే ర్యాంకింగ్స్​ను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). టాప్​ 10 బ్యాటర్ల జాబితాలో టీమ్​ఇండియా నుంచి స్టార్​ ఓపెనర్ స్మృతి మంధాన మాత్రమే నిలిచింది.

Smriti Mandhana
Smriti Mandhana in women's rankings
author img

By

Published : Jun 21, 2022, 5:13 PM IST

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్​లో 8వ స్థానంలోనే కొనసాగుతోంది టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన. ఈ మేరకు మంగళవారం ఐసీసీ తాజా ర్యాంకింగ్స్​ ప్రకటించింది. బౌలర్ల జాబితాలో ఒక స్థానం కిందకు పడిపోయింది సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామీ.

ఈ ఏడాది ఆడిన 9 మ్యాచుల్లో 411 పరుగులు చేసింది 25 ఏళ్ల మంధాన. అందులో ప్రపంచకప్​లో వెస్టిండీస్​పై చేసిన ఓ సెంచరీ కూడా ఉంది. ఆస్ట్రేలియన్​ అలిస్సా హీలీ అగ్రస్థానంలో ఉన్న ఈ టాప్​ 10 బ్యాటర్ల జాబితాలో భారత్​ నుంచి కేవలం స్మృతి మంధాన మాత్రమే ఉంది.

ఇక బౌలర్ల ర్యాంకింగ్స్​లో ఐదు నుంచి ఆరో స్థానానికి పడిపోయింది గోస్వామీ. 39 ఏళ్ల గోస్వామీ.. ఈ ఏడాది 9 మ్యాచుల్లో 12 వికెట్లు పడగొట్టింది. ఇక ఆల్​రౌండర్ల జాబితాలో ఏడో స్థానంలోనే కొనసాగుతోంది దీప్తి శర్మ.

ఇదీ చూడండి: Team India: సీనియర్లు హిట్​.. జూనియర్లు ఫట్​​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.