ETV Bharat / sports

'హార్దిక్​ పాండ్య అలా అవడానికి కృనాలే కారణం'

Hardik Recovery: టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య ఐపీఎల్​లో అదరగొడుతున్నాడు. కొత్త జట్టు గుజరాత్​ టైటాన్స్​ను ముందుండి నడిపిస్తూ.. వ్యక్తిగతంగానూ బ్యాటింగ్​, బౌలింగ్​లో రాణిస్తున్నాడు.

Krunal has played a major role in Hardiks recovery

author img

By

Published : Apr 3, 2022, 7:45 AM IST

Hardik Recovery: ఐపీఎల్​ పునరాగమనంలో హార్దిక్​ పాండ్య సత్తాచాటుతున్నాడు. కొత్త టీం గుజరాత్​ టైటాన్స్​కు కెప్టెన్​గా ఉన్న పాండ్య.. వరుసగా రెండు మ్యాచ్​ల్లో గెలిపించాడు. వ్యక్తిగతంగానూ బ్యాటింగ్​ మాత్రమే కాకుండా.. బౌలింగ్​లోనూ ఆకట్టుకుంటున్నాడు. కొంతకాలం కింద.. ఫిట్​నెస్​ లేమి, వరుస వైఫల్యాలు, గాయాలతో ఇబ్బందిపడి జట్టులో చోటు కోల్పోయిన పాండ్య ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. 2019 తర్వాత.. అతడు ఐపీఎల్​లో బౌలింగ్​ చేయడం ఈ సీజన్​లోనే తొలిసారి కావడం విశేషం.

గతేడాది టీమ్​ఇండియాకు రాణించలేకపోతున్న సమయంలోనూ.. తాను ఫిట్​నెస్​పై దృష్టి పెడుతున్నానని, తనను కేవలం బ్యాటర్​గానే పరిగణనలోకి తీసుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. 2021 టీ-20 వరల్డ్​కప్​లో పాండ్య చివరిసారి టీమ్​ఇండియా తరఫున ఆడాడు. అనంతరం.. ఫిట్​నెస్​పై దృష్టి పెట్టేందుకు జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ ఈ ఐపీఎల్​లో గుజరాత్​ టైటాన్స్​ కెప్టెన్​గా కొత్త అవతారంలో ఆకట్టుకుంటున్నాడు. హార్దిక్​ బలంగా పుంజుకోవడానికి.. అతడి సోదరుడు కృనాల్​ పాండ్య కీలక పాత్ర పోషించి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా మాజీ ఆటగాడు సురేశ్​ రైనా. కెరీల్​లో అత్యంత క్లిష్టమైన దశలో.. హార్దిక్​కు కృనాల్​ నుంచి మద్దతు, సహకారం లభించిందని అన్నాడు.

''హార్దిక్​ పాండ్య పునరాగమనం ప్రశంసనీయం. ఒక ఆటగాడు గాయాలబారిన పడి కోలుకోవడంలో.. కుటుంబం కీలక పాత్ర పోషిస్తుంది. పాండ్య బౌలింగ్​ చేస్తుంటే.. అతని భార్య చాలా సంతోషంగా ఉంది. పాండ్యకు.. కావాల్సినంత సహకారం అందించాడు కృనాల్​. హార్దిక్​ ఇప్పుడు చక్కగా రాణిస్తున్నాడు. ఫిట్​గా కనిపిస్తూ.. బాల్​తో చక్కటి పేస్​ రాబడుతున్నాడు. ఇది గుజరాత్​ టైటాన్స్​కు మంచి చేస్తుంది.''

- సురేశ్​ రైనా, భారత మాజీ ప్లేయర్​

తొలి మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​పై 5 వికెట్ల తేడాతో గెలిచిన పాండ్య టీం, రెండో మ్యాచ్​లో బలమైన దిల్లీపై 14 పరుగుల తేడాతో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. బ్యాటింగ్​లో హార్దిక్​ పాండ్య, శుభ్​మన్​ గిల్​ మంచి ఫామ్​లో ఉన్నారు. డేవిడ్​ మిల్లర్​, రాహుల్​ తెవాటియా ఆఖర్లో చెలరేగిపోతున్నారు. పదునైన బౌలింగ్​ టైటాన్స్​ సొంతం. మహ్మద్​ షమి, ఫెర్గూసన్​, రషీద్​ ఖాన్​, తెవాటియా, పాండ్య బంతితో మంచి ప్రదర్శన చేస్తున్నారు. ఏప్రిల్​ 8న పంజాబ్​ కింగ్స్​తో తన తదుపరి మ్యాచ్​ ఆడనుంది.

ఇవీ చూడండి: ప్రపంచకప్​ ఫైనల్లో ఆసీస్-ఇంగ్లాండ్ ఢీ.. ఆ జట్టుకు మోదీ విషెస్

ఫెంటాస్టిక్​ ఫెర్గూసన్​.. దిల్లీని ఓడించిన గుజరాత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.