ETV Bharat / sports

IND vs WI T20 : టీ20ల్లో కోహ్లీ-రోహిత్ పరిస్థితేంటో?

Kohli Rohit vs west indies T20 : 2022 టీ20 వరల్డ్​ కప్​ ముగిసి దాదాపు 8 నెలలు అవుతోంది. ఆ తర్వాత జరగిన ఒక్క టీ20 సిరీస్​లోనూ కోహ్లీ, రోహిత్ కనపడలేదు. దీంతో వాళ్ల టీ20 కెరీర్​ ముగిసినట్టేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆ వివరాలు..

T20  kohli Rohith
టీ20ల్లో కోహ్లీ-రోహిత్​ను ఇక చూడలేమా?
author img

By

Published : Jul 6, 2023, 9:44 AM IST

kohli vs west indies players : జులై నెలలో వెళ్లబోయే వెస్టిండీస్ పర్యటనకు సంబంధించి.. టీ20 భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. అయితే ఇక్కడ ఐపీఎల్ ప్రదర్శన వల్ల హైదరాబాద్ క్రికెటర్‌ తిలక్‌ వర్మకు మొదటిసారి అంతర్జాతీయ జట్టులో చోటు దక్కడం విశేషం. కానీ స్టార్​ ప్లేయర్లు కెప్టెన్​ రోహిత్​ శర్మ, విరాట్​ కోహ్లీకి మాత్రం చోటు దక్కలేదు. వారికి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చి.. హార్దిక్​ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.

Rohit vs west indies T20 : 8 నెలల నుంచి ఒక్క సిరీస్​లోనూ.. అయితే 2022 టీ20 వరల్డ్​ కప్​ ముగిసి దాదాపు 8 నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ సారి వరల్డ్​ కప్​ తర్వాత టీమ్ఇండియా ఆడిన సిరీస్​లు గమనిస్తే.. భారత జట్టు ఆడిన ఏ టీ20 సిరీస్‌లోనూ స్టార్​ బ్యాటర్​ విరాట్‌ కోహ్లీ, కెప్టెన్​ రోహిత్‌ శర్మ అస్సలు కనిపించలేదని అర్థమవుతోంది.

మొదట్లే క్రికెట్​ అభిమానులు అందరూ విశ్రాంతిగానే భావించారు. కానీ ఆ తర్వాత గమనిస్తే.. వీరిని పక్కనపెట్టినట్లు అర్థమవుతోంది. ఓ సిరీస్‌ తర్వాత మరో సిరీస్‌కు వీరు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఎందులోనూ పాల్గొనట్లేదు. ఇప్పుడు వెస్టిండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్​కు కూడా ఎంపిక చేసిన జట్టులోనూ.. స్టార్ బ్యాటర్​ కోహ్లీ, కెప్టెన్​ రోహిత్‌ లేరు.

వేటు వేయలేదు.. గతంలోనూ ఇలానే.. వరల్డ్ కప్​ తర్వాత రోహిత్‌ శర్మను.. టీ20 కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పించినట్లుగా బీసీసీఐ పేర్కొనలేదు. కానీ హార్దిక్‌ పాండ్యాను మాత్రం సారథిగా ఎంపిక చేసి వరుసగా మూడు సిరీస్‌ల అతడి సారథ్యంలోనే ఆడించింది. ఈ పరిణామాలను చూస్తుంటే.. రోహిత్‌, కోహ్లిలకు వయసు మీద పడింది. కెరీర్‌ లాస్ట్​ స్టేజ్​కు వచ్చింది. వారి దృష్టి ప్రస్తుతం కేవలం వన్డే ప్రపంచకప్‌ మీదే ఉందని అర్థమవుతోంది. అందుకే ఆ స్థాయి ప్లేయర్ల మీద వేటు వేయడం ఎలాగో జరగదు. గతంలోనూ కూడా ఇలానే జరిగింది. 2007 టీ20ల నుంచి సచిన్‌, ద్రవిడ్‌ లాంటి సీనియర్లు ఎలా తప్పుకున్నారో.. ఇప్పుడు వీళ్లు కూడా అలానే సైలెంట్​గా వారంత వారే దూరం అయ్యారని చెప్పొచ్చు.

ప్రపంచకప్పే లక్ష్యంగా.. 2024 వరల్డ్​ లక్ష్యంగా టీ20 జట్టులో యంగ్ ప్లేయర్స్​కు పెద్ద పీట వేస్తోంది బీసీసీఐ. కాబట్టి ఈ నేపథ్యంలో మర్యాద పూర్వకంగానే వీరిద్దరిని టీ20ల నుంచి తప్పుకోమని సూచించి ఉండొచ్చు. లేదంటే కోహ్లీ, రోహితే స్వయంగా పరిస్థితిని అర్థం చేసుకుని ఈ ఫార్మాట్​కు దూరంగా ఉండాలని కూడా నిర్ణయించుకుని ఉండొచ్చు. చెపల్లేం ఏం జరిగిందనేది. కాబట్టి మళ్లీ ఈ ఇద్దరిని టీమ్​ఇండియా తరఫున టీ20ల్లో చూడటం అనుమానమే అని చెపొచ్చు. అలాగే ఈ ఇద్దరితో పాటు వరల్డ్​కప్​లో ఆడిన అశ్విన్‌, షమి, భువనేశ్వర్‌ లాంటి సీనియర్​ ప్లేయర్లు కూడా ఇక మళ్లీ టీ20లు ఆడే ఛాన్స్​ లేదు.

ఇదీ చూడండి :

West Indies vs India T20 squad 2023 : హైదరాబాద్ కుర్రాడు.. అందరూ మెచ్చినోడు..

టీ20 టీమ్ నుంచి కోహ్లీ, రోహిత్​ ఔట్.. తిలక్ వర్మ​కు ఛాన్స్.. విండీస్ టూర్​కు భారత జట్టు ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.