ETV Bharat / sports

కోహ్లీకి నిక్​నేమ్​ పెట్టింది ఎవరో తెలుసా? - కోహ్లీ ముద్దుపేరు చీకూ

తన ముద్దుపేరు వెనక ఉన్న రహస్యాన్ని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఆ పేరును అతడికి ఎవరు పెట్టారు? ముందుగా ఆ పేరుతో ఎవరు పిలిచారు? తదితర విషయాల్ని గతంలో ఓసారి చెప్పాడు.

virat kohli nickname
విరాట్ కోహ్లీ నిక్​నేమ్
author img

By

Published : Aug 23, 2021, 2:50 PM IST

Updated : Aug 23, 2021, 3:54 PM IST

ప్రతి ఒక్కరికీ అసలు పేరుతో పాటు దాదాపుగా ముద్దుపేరు కూడా ఉంటుంది. కొందరికి పుట్టుకతో తల్లిదండ్రులు పెడితే మరికొందరికి వారి చేష్టల వల్ల వారి ప్రవర్తన వల్ల నిక్​నేమ్​లు పుట్టుకొస్తుంటాయి. అలాగే మన టీమ్ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీకి కూడా ఓ నిక్​నేమ్​ ఉంది. అయితే ఆ పేరు అతడికి ఎవరు పెట్టారు. దాని వెనక ఉన్న విషయాలను కోహ్లీ గతంలో ఓసారి వెల్లడించాడు.

Kohli reveals story behind nickname 'Chiku'
కోహ్లీ చిన్ననాటి ఫొటో

కోహ్లీ ముద్దు పేరు 'చీకూ'. కానీ, ఈ పేరు పాపులర్​ కావడానికి మాత్రం మాజీ కెప్టెన్ ధోనీనే కారణం. ఆటలో భాగంగా కోహ్లీని పిలవడానికి చీకూ అనే పేరునే తరచూ మహీ ఉపయోగించేవాడు. వికెట్ల వెనక నుంచి పదే పదే పిలవడం ద్వారా అది కాస్త స్టంప్స్​ మైక్​లో రికార్డయింది. దీంతో ఈ నోటా ఆ నోటా ఆ నిక్​నేమ్​ అందరికీ తెలిసిపోయింది. విరాట్​కు ఆ పేరును పెట్టింది మాత్రం తన చిన్ననాటి కోచ్​. అతనే మొదటిసారిగా ఆ నిక్​నేమ్​తో పిలిచాడట.

"రంజీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో నాకు బుగ్గలు బాగా ఉండేవి. అప్పట్లో కొత్త హెయిర్​ స్టైల్ కోసం ప్రయత్నించడం వల్ల చెవులు, చెంపలు మాత్రమే కనిపించేవి. దీంతో కార్టూన్ పాత్ర చీకూ పేరును కోచ్ నాకు పెట్టేశారు. అప్పటి నుంచి అంతా అలా పిలవడం మొదలుపెట్టారు"

-కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్.

ఇదీ చదవండి: ద్రవిడ్​ ఎన్​సీఏలో కోచ్​లకు 'కొత్త పాఠాలు'

Last Updated : Aug 23, 2021, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.