Kohli Captaincy: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓటమి అనంతరం టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు సారథిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో నాయకుడిగా కోహ్లీ సాధించిన అరుదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం..
- గతేడాది లార్డ్స్ గెలుపుతో కోహ్లీ రెండు ఘనతలు అందుకున్నాడు. కపిల్ దేవ్ (1986), మహేంద్ర సింగ్ ధోనీ (2014) తర్వాత లార్డ్స్‌లో విజయం సాధించిన భారత మూడో కెప్టెన్‌గా అవతరించాడు. సారథిగా ఎక్కువ టెస్టు విజయాలు అందుకున్న నాలుగో ఆటగాడిగా ఎదిగాడు. క్లైవ్ లాయిడ్‌ను అధిగమించాడు.
- దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ కెప్టెన్‌గా ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన వారిలో ముందున్నాడు. అతడు 109 మ్యాచులకు సారథ్యం వహించగా 53 గెలిచాడు. 29 ఓడాడు.
- ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అతడి సారథ్యంలో ఆసీస్ ఎలాంటి విజయాలు సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు 77 మ్యాచుల్లో సారథ్యం వహిస్తే 48సార్లు గెలిపించాడు. 16 మ్యాచుల్లో ఓటమి పాలయ్యాడు.
- ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వాకు ఘనమైన చరిత్రే ఉంది. కంగారూలకు తిరుగులేని నాయకత్వం అందించాడు. 57 టెస్టులకు సారథ్యం వహిస్తే ఆసీస్ ఏకంగా 41 గెలవడం సాధారణ విషయం కాదు. కేవలం 9 మాత్రమే ఓడింది.
- భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో నాలుగో స్థానానికి ఎదిగాడు. 68 మ్యాచుల్లో టీమ్‌ఇండియాను నడిపించగా 40 సార్లు గెలిపించాడు. కేవలం 17 మ్యాచుల్లోనే ఓటమి పాలయ్యాడు.
- వెస్టిండీస్ మాజీ సారథి క్లైవ్ లాయిడ్ అద్భుతమైన సారథి. కరీబియన్ జట్టుకు 74 మ్యాచుల్లో సారథ్యం వహించగా 36 సార్లు గెలిపించాడు. కేవలం 12 ఓటములే అతడి ఖాతాలో ఉన్నాయి. విరాట్ అతడిని అధిగమించడం గమనార్హం.
భారత జట్టు కెప్టెన్‌గా(2013-22)..
అన్ని ఫార్మాట్లలో కలిపి భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లీ 213 మ్యాచ్‌లు ఆడగా.. 135 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. 60 మ్యాచ్‌లు ఓడిపోగా, 11 డ్రా అయ్యాయి.
పరుగుల వరద..
టెస్టు కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా 113 ఇన్నింగ్స్ ఆడిన విరాట్.. 5864 పరుగులు చేశాడు. ఇందులో 20 శతకాలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: