kl Rahul captain: టీమ్‌ఇండియా వరుస సిరీస్‌లతో బిజీగా ఉంటే.. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం వివిధ కారణాలతో కీలక సిరీస్‌లకు దూరం అయ్యాడు. అయితే, ఇటీవల జింబాబ్వే సిరీస్‌కూ రాహుల్ లేకుండానే బీసీసీఐ జట్టును ప్రకటించింది. కానీ, తాజాగా రాహుల్ ఫిట్‌నెస్ టెస్టులో అర్హత సాధించడంతో జింబాబ్వేతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో ఆడేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్, జింబాబ్వేల మధ్య ఆగస్టు 18న తొలి వన్డే, ఆగస్టు 20న రెండో వన్డే, ఆగస్టు 22న మూడో వన్డే జరగనుండగా వీటికి భారత్ జట్టుకు కేఎల్ రాహుల్‌కే సారథ్య బాధ్యతలు అప్పగించడం విశేషం.
జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు తొలుత శిఖర్ ధావన్‌కు జట్టు నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. అయితే, కేఎల్ రాహుల్ పునరాగమనం కావడంతో ధావన్‌ను వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ అతని స్థానంలో రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే జింబాబ్వేతో సిరీస్ ముగిసిన తర్వాత వచ్చే ఆసియా కప్‌లోనూ కేఎల్ రాహుల్ ఆడే అవకాశం ఉంది.
భారత జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.
ఇవీ చదవండి: ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిందెవరో తెలుసా? పాపం పాక్..!