ETV Bharat / sports

కేఎల్ రాహుల్​ పెళ్లి.. కోహ్లీ-పంత్​ ఫన్నీ మీమ్స్​ డ్యాన్స్ చూశారా.. నవ్వులే నవ్వులు! - కేఎల్ రాహుల్ పెళ్లి

టీమ్​ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తన ప్రియురాలు అతియా శెట్టిని వివాహం చేసుకోవడంతో ఫ్యాన్స్​ సోషల్​మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఫన్నీ మీమ్స్​తో హోరెత్తిస్తున్నారు. అవి చూస్తే నవ్వులే నవ్వులు.. ఓ సారి సరదాగా చూసేయండి..

KL Rahul Athiya shetty social media funny memes
కేఎల్ రాహుల్​ పెళ్లి.. కోహ్లీ-పంత్​ ఫన్నీ మీమ్స్​ డ్యాన్స్ చూశారా.. నవ్వులే నవ్వులు!
author img

By

Published : Jan 24, 2023, 9:09 AM IST

టీమ్​ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ స్టార్ యాక్టర్​ సునీల్​ శెట్టి కూతురు, నటి అతియా శెట్టి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఖండాలాలోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్​లో అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో వీరి పెళ్లి గ్రాండ్​గా జరిగింది. ఇక ఐపీఎల్ తర్వాతే వీరి రిసెప్షన్ ఉండనున్నట్లు తెలిసింది. ఈ వేడుకకు భారత్ క్రికెటర్లు ఇషాంత్ శర్మ, వరుణ్ అరోన్ హాజరయ్యారు. ఇండస్ట్రీ నుంచి అనుపమ్ ఖేర్, అన్షులా కపూర్, కృష్ణా ష్రాఫ్, అజయ్ దేవ్‌గణ్ తదితరులు హాజరయ్యారు. ఇక తమ అభిమాన క్రికెటర్​ రాహుల్ పెళ్లి పీటలెక్కడంతో​ ఫ్యాన్స్​ శుభాకాంక్షలు తెలుపుతూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్​మీడియాను హోరెత్తిస్తున్నారు. రకరకాల ఫన్నీ మీమ్స్​తో సందడి చేస్తున్నారు.

భారత క్రికెటర్లు ఇలా డ్యాన్స్ చేస్తున్నారంటూ రకరకాల వీడియోలను వైరల్ చేస్తున్నారు. గాయాలపాలై కట్లతో ఉన్న ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్​ చేసి.. రాహుల్ పెళ్లిలో పంత్ డ్యాన్స్ అంటూ తెగ నవ్విస్తున్నారు. ముఖాలు కనిపించకుండా నెత్తిన గిన్నెలు బోర్లించుకొని కొందరు వెళ్తున్న ఫొటోను షేర్ చేసి.. రాహుల్ పెళ్లిలో పాకిస్థాన్ క్రికెటర్లంటూ ఫన్నీగా పోస్ట్ చేస్తున్నారు. ఇంకా పలు రకాల మీమ్స్​ను ట్రెండ్​ చేస్తున్నారు. ఓ సారి వాటిని చూసేద్దాం..

ఇదీ చూడండి: వివాహబంధంలోకి అడుగుపెట్టిన రాహుల్​- అతియా.. మ్యారేజ్​ ఫొటోస్​ మీకోసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.